Krishna Janmashtami 2024: యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!

Krishna Janmashtami 2024: యుగాలు మారినా.. తరాలు మారినా.. కృష్ణతత్వమే ఇంకా దారి చూపుతోందా.!

Anil kumar poka

| Edited By: TV9 Telugu

Updated on: Aug 26, 2024 | 4:50 PM

అవును..కృష్ణయ్య జీవితమంతా సంఘర్షణే! అడ్డాలనాడే ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నాడో బిడ్డడు! కానీ..జీవితంలో ఏ దశలోనూ విచలితుడు కాలేదు కృష్ణయ్య! కారాగారంలో పుట్టడం..పుట్టడంతోనే అమ్మానాన్నలైన.. దేవకీ- వసుదేవులకు దూరం కావడం చిన్నవిషయమా? ఎంతో ప్రేమగా పెంచిన నంద- నంద-యశోదలకు, గోకులానికి కూడా దూరం కావడం తట్టుకోవడం సాధ్యమా?

కృష్ణ భక్తితో మనసులు ఉప్పొంగిపోతున్న క్షణాలివి. యుగాలు మారినా..తరాలు మారినా.. కృష్ణ తత్వం ప్రపంచానికి దారి చూపుతూనే ఉంది. కృష్ణగీత మనలో స్థైర్యాన్ని నింపుతూనే ఉంది. ప్రేమ, త్యాగం, సమర్పణ, ఆశావహ దృక్పథం..ఇలా..పరిశీలించాలేగానీ.. కృష్ణగాధ అంతా చైతన్య బోధే మానవాళికి! రాజనీతి నుంచి యుద్ధనీతి వరకు.. కృష్ణబోధలే అస్త్ర శస్త్రాలు మనకు! జన్మాష్టమి సందర్భంగా..ఆ వాసుదేవుడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం!

శ్రీకృష్ణుడిని అర్థం చేసుకుందాం!
సామర్థ్యం, అధికారం ఉన్నప్పటికీ
సహనాన్ని కల్గిన సాహసి!

సుదర్శన చక్రధారి..
అయినా.. సర్వదా వేణుగాన లహరి!

మహా పరాక్రమశాలి..
అయినా.. అర్జునిడికి సారథి!

నిత్యం సంఘర్షణే..!
కానీ విశ్వాసం కోల్పోని విజహ విహారి!

అవును..కృష్ణయ్య జీవితమంతా సంఘర్షణే! అడ్డాలనాడే ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నాడో బిడ్డడు! కానీ..జీవితంలో ఏ దశలోనూ విచలితుడు కాలేదు కృష్ణయ్య! కారాగారంలో పుట్టడం..పుట్టడంతోనే అమ్మానాన్నలైన.. దేవకీ- వసుదేవులకు దూరం కావడం చిన్నవిషయమా? ఎంతో ప్రేమగా పెంచిన నంద- నంద-యశోదలకు, గోకులానికి కూడా దూరం కావడం తట్టుకోవడం సాధ్యమా? జరాసంధుడితో పదేపదే యుద్ధాలను నివారించడానికి మధుర నుంచి కూడా దూరం కావాల్సివచ్చింది. అంతేకాదు, ఎంతో వైభవంగా నిర్మించిన ద్వారకా నగరం కూడా సముద్రంలో కలిసిపోయింది. జీవితంలో ఎన్ని కోల్పోయినా..ఎన్ని బంధాలు దూరమైనా..దుఃఖానికి వశం కాలేదు మురారి!

ఇప్పుడు మనం చుట్టూ చూస్తూనే ఉన్నాం..స్టేటస్‌ని బట్టి స్నేహాలు..అవసరాన్ని బంట్టి అనుబంధాలు! కానీ స్నేహం ఎలా చేయాలో కృష్ణయ్య నుంచే నేర్చుకోవాలి! స్నేహంలో తీపినీ, పంచుకోవడంలో పరమార్థాన్ని పసితనంలోనే పరిచయం చేశాడు గోవిందుడు! నందమహారాజు కొడుకైనా..పేద గోపాలకులతో చనువుగా చల్ది ముద్దలు ఆరగించాడు భగవానుడు! ద్వారకాధీశుడైనా..తన బాల్యమిత్రుడు కుచేలుడిని మరువలేదు. అటుకుల మూటతో వచ్చినవాడికి..అనంత సంపదలు మూటకట్టి పంపాడు.

అంతేకాదు, నమ్ముకున్నవారిని ఏనాడూ విడిచిపెట్టలేదు భగవానుడు! కౌరవ సభలో పడతి పరువు నిలిపాడు ఆపద్బాంధవుడు! కురుక్షేత్ర సంగ్రామం ముగిసేవరకు..చెలికాడైన అర్జునుడి చేయి వదల్లేదు ఆ శరణాగత వత్సలుడు! కృష్ణతత్వం అధ్యయనం చేసినవారికి తెలుస్తుంది..జీవితంలో ప్రతి సవాలునూ స్వీకరించాల్సిందే! కురుక్షేత్ర యుద్ధం కూడా లీలా విలాసమే! భగవానుని అంతిమ లక్ష్యం.. ధర్మ సంస్థాపనే! అర్జునుడికి చేసింది గీత బోధ మాత్రమే కాదు..యావత్ జగత్తుకూ కర్తవ్య బోధ! అందుకే అంటారు గీత చదివితే రాత మారుతుందని!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Aug 26, 2024 12:00 PM