Viral: మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..

Viral: మధ్యప్రదేశ్‌లో విషాదం.! ఆవును కాపాడబోయి ముగ్గురు మృతి..

Anil kumar poka

|

Updated on: Aug 26, 2024 | 12:12 PM

మధ్యప్రదేశ్‌లోని భిండ్‌ జిల్లాలో ఆవును కాపాడేందుకు ఓ రైతు డ్యాం నీటిలోకి దూకగా.. ఎస్డీఈఆర్‌ఎఫ్‌ జవాన్లు చేపట్టిన గాలింపు చర్యలు మరింత విషాదాన్ని మిగిల్చాయి. ఈ ఘటనలో కువారీ నది ప్రవాహ ధాటికి మూడు ప్రాణాలు బలయ్యాయి. విజయ్‌సింగ్‌ అనే రైతుకు చెందిన ఆవు బుధవారం సాయంత్రం డ్యాం నీటి తూముల వద్ద చిక్కుకుపోయింది. ఆవును కాపాడేందుకు యజమాని విజయ్‌సింగ్‌తోపాటు వరుసకు అతడి సోదరుడైన దినేశ్‌ భదోరియా డ్యాం నీటిలోకి దూకారు.

మధ్యప్రదేశ్‌లోని భిండ్‌ జిల్లాలో ఆవును కాపాడేందుకు ఓ రైతు డ్యాం నీటిలోకి దూకగా.. ఎస్డీఈఆర్‌ఎఫ్‌ జవాన్లు చేపట్టిన గాలింపు చర్యలు మరింత విషాదాన్ని మిగిల్చాయి. ఈ ఘటనలో కువారీ నది ప్రవాహ ధాటికి మూడు ప్రాణాలు బలయ్యాయి. విజయ్‌సింగ్‌ అనే రైతుకు చెందిన ఆవు బుధవారం సాయంత్రం డ్యాం నీటి తూముల వద్ద చిక్కుకుపోయింది. ఆవును కాపాడేందుకు యజమాని విజయ్‌సింగ్‌తోపాటు వరుసకు అతడి సోదరుడైన దినేశ్‌ భదోరియా డ్యాం నీటిలోకి దూకారు. ప్రవాహ వేగానికి ఇద్దరూ కొట్టుకుపోయారు. గ్రామస్థులు తాళ్ల సాయంతో విజయ్‌ను కాపాడినా ఉపయోగం లేకపోయింది. కాసేపటికి అతడు మృతిచెందాడు.

నది మధ్యలో పొదల్లో చిక్కుకొని ఉన్న దినేశ్‌ను గుర్తించిన గ్రామస్థులు ఎస్డీఈఆర్‌ఎఫ్‌కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ముగ్గురు సభ్యులు ఓ పడవలో దినేశ్‌ వద్దకు వెళ్లబోయారు. వీరి పడవ బోల్తాపడి ముగ్గురూ జలప్రవాహంలో చిక్కుకుపోయారు. ఈ బృందంలో ఓ వ్యక్తి ఎలాగోలా బయటపడినా మిగతా వారి లైఫ్‌ జాకెట్లు చిరిగిపోయాయి. దాంతో ప్రవీణ్‌ కుశ్వాహా, హర్దాస్‌ చౌహాన్‌ అనే ఆ ఇద్దరి మృతదేహాలను గురువారం బయటకు తీశారు. ఈ ఘటనలో ఆవుతో పాటు దినేశ్‌ను మాత్రం కాపాడగలిగామని భిండ్‌ ఎస్పీ అసిత్‌ యాదవ్‌ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.