Horoscope Today: ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు.. సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

| Edited By: Ravi Kiran

Feb 13, 2023 | 9:06 AM

జ్యోతిష్యం, రాశి ఫలాలను విశ్వసించే వారు మనలో చాలా మందే ఉన్నారు. రాశి ఫలాల ఆధారంగా రోజును ప్రారంభించే వారు కూడా ఉంటారు. రాశి ఫలాలను చూసుకొని కార్యక్రమాలను వాయిదా వేయడం లేదా రద్దు చేసుకుంటున్నారు. మరి ఈరోజు (సోమవారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో..

Horoscope Today: ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు.. సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Follow us on

జ్యోతిష్యం, రాశి ఫలాలను విశ్వసించే వారు మనలో చాలా మందే ఉన్నారు. రాశి ఫలాల ఆధారంగా రోజును ప్రారంభించే వారు కూడా ఉంటారు. రాశి ఫలాలను చూసుకొని కార్యక్రమాలను వాయిదా వేయడం లేదా రద్దు చేసుకుంటున్నారు. మరి ఈరోజు (సోమవారం) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చెక్‌ చేసుకోండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఓ ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబంలో సామరస్య పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు యధావిధిగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా గడిచిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక పరిస్థితి చక్కగా మెరుగుపడుతుంది. దానధర్మాలు చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారంలో కొత్త ఆలోచనలు చేస్తారు. ఐటీ రంగం వారికి ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన విధంగా ఉద్యోగం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. అధికారులతో వ్యవహరించడంలో ఆచితూచి వ్యవహరించాలి. అపార్ధాలకు అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

రాజయోగం పట్టడానికి అవకాశం ఉంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందు తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. ఒకటి రెండు చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇతరులకు వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం ప్రస్తుతానికి మంచిది కాదు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచడం మంచిది. వృత్తి నిపుణులు ఉద్యోగం మారే ప్రయత్నం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు మధ్య మధ్య చికాకు పెడతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు ఉదారంగా సహాయం చేస్తారు. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో గౌరవ అభిమానాలు పెంపొందుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్య తలు అప్పగిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ప్రేమ జీవితం ఆనందంగా గడిచిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంతో కలిసి విహారయాత్ర చేస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి చిన్న ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలపరంగా ముందడుగు వేస్తారు. ఐటీ నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ జీవితంలో ఖర్చు పెరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా అంతా మన మంచికే అనుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు ఆశించిన విధంగానే పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి యధాతధంగా కొనసాగుతుంది. అనవసర ఔదార్యం వల్ల ఇబ్బంది పడతారు. అవసరానికి తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. విద్యార్థులకు పర్వాలేదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అనుకోకుండా ఆదాయం ఆశించిన దాని కంటే ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. తోబుట్టువులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళతాయి. పిల్లలు పురోగతి చెందుతారు. ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. ఉద్యోగపరంగా శుభవార్త వింటారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారంలో లాభాల శాతం కొద్దిగా పెరుగుతుంది. ఐటీ నిపుణులకు కాలం కలిసి వస్తుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. విద్యార్థులు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రేమ జీవితం కొద్దిగా సమస్యలు సృష్టిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఇతరులకు సహాయపడతారు. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. కొందరు స్నేహితులు మిమ్మల్ని బాగా ఉపయోగించుకుంటారు. వ్యాపారంలో బాగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. వృత్తి జీవితంలో ఉన్నవారు ముందడుగు వేసే అవకాశం ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచ యాలు ఏర్పడతాయి. ప్రేమ జీవితం పరవా లేదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సంద ర్శిస్తారు. మిత్రుల సహాయంతో ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వ్యాపారు లకు కూడా లాభాలపరంగా జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పర్వాలేదు. ప్రేమ జీవితం ఉత్సాహం కలిగిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..