Horoscope Today (10-08-2022): ఏ రంగంలోనివారైనా, సామాన్యులైన రోజులు ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా.. మంచి చెడుల గురించి ఆలోచించి, ముందుకు అడుగులు వేస్తుంటారు. ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని వెంటనే తమ దినఫలాల( Daily Horoscope)ను చెక్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగస్టు 10వ తేదీ ) బుధవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. కొన్ని విషయాలు ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు కాలాన్ని వృధా చేయకుండా గత కొంతకాలంగా వాయిదాపడుతున్న పనులను ప్రారంభించండి. చేపట్టిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను ప్రతిభతో పూర్తి చేస్తారు.
కర్కాటక రాశి: ఈ రాశివారు ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వ్యాపారస్థు లాభాలను సొంతం చేసుకుంటారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో సమయాన్ని వృధా చేయకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు శుభఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యలతో సుఖ సంతోషాలతో గడుపుతారు. మానసికంగా ధైర్యాన్ని ఇచ్చే సంఘటన చోటు చేసుకుంటుంది.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు వాదనలకు దూరంగా ఉండండి. చేపట్టే పనుల విషయంలో ఆయా రంగాల్లో ప్రోత్సాహాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసిక బలం తగ్గకుండా ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉంటుంది. నిరుత్సాహం కలిగే కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంది.
ధనస్సు: ఈరాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. అనవసర వివాదాల జోలికి వెళ్లకూడదు. గో సేవతో మనసుకు ప్రశాంతత కలుగుతుంది. శని శ్లోకం పఠిస్తే మేలు చేకూరుతుంది.
మకరం: వీరికి అనవసర ఖర్చులు తప్పవు. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదరువుతాయి. విశ్వాసపాత్రులెవరో, నమ్మకద్రోహులెవరో తెలుసుకోవాలి. సూర్య నమస్కారాలతో మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులలో విజయాన్ని సొంతం చేసుకుంటారు.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు పట్టుదలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారు శుభ ఫలితాలను అందుకుంటారు. ఇతరుల సహకారంతో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు.
గమనిక: రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.