AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు ప్రకారం ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏవో తెలుసా..? పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..నష్టపోతారు..!

వాస్తు శాస్త్రం అంటే ఇండ్లు, భవనాల నిర్మాణానికి సంబంధించిన భారతీయ ప్రాచీన విజ్ఞానం. ఇది మన ఇంటిలో శాంతి, ఆరోగ్యం, ధనం పెరిగేందుకు ఉపయోగపడుతుందని నమ్ముతారు. ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం ఉంటే కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వాస్తు ప్రకారం ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏవో తెలుసా..? పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..నష్టపోతారు..!
Vastu Tips
Prashanthi V
|

Updated on: Feb 26, 2025 | 2:33 PM

Share

వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించినప్పటికీ కొన్ని పనులు తెలియక చేస్తుంటాం. ఇవి అనేక కష్టాలను తెచ్చిపెట్టే అవకాశముంది. ప్రత్యేకించి ఇంట్లో కొన్ని అనుకూలంగా లేని వస్తువులను ఉంచడం వల్ల అప్పులు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇంట్లో ఉండకూడని కొన్ని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గడియారాలు

ఇంట్లో పనిచేయని గడియారం ఉంటే ఇది ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

యుద్ధ చిత్రాలు

హాలులో మహాభారత యుద్ధ దృశ్యాలు కలిగిన ఫోటోలు ఉంటే ఇంట్లో కలహాలు పెరుగుతాయి. కుటుంబ సంబంధాలు బలహీన పడతాయి.

నెగటివ్ ప్రదేశాలు

ఇంటికి ఎదురుగా ఆస్పత్రులు, మాంసాహార దుకాణాలు, ఇనుము వస్తువుల తయారీ షాపులు ఉంటే ఇంట్లో శాంతి కరువవుతుందని నిపుణులు చెబుతున్నారు.

అక్వేరియం

ఇంట్లో అక్వేరియం పెట్టడం మంచిదే.. కానీ ఇది సరైన దిశలో ఉంచకపోతే ప్రతికూల ఫలితాలు వస్తాయి. దక్షిణ, పశ్చిమ దిశల్లో అక్వేరియం ఉంచకూడదు. ఉత్తరం, తూర్పు దిశల్లో పెట్టడం ద్వారా మంచి జరుగుతుంది.

దేవతా విగ్రహాలు

ఇంట్లో తలకు మించిన దేవతా విగ్రహాలను ఉంచకూడదు. ఇవి నెగటివ్ ఎనర్జీకి కారణం అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

మనీ ప్లాంట్

ఇంటి ముందు మనీ ప్లాంట్ తీగలు అల్లుకున్నట్లైతే దుష్టశక్తుల ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఆర్థిక స్థిరతను తీసుకువస్తుందని నమ్మకం.

లైటింగ్

ఇంట్లో లైటింగ్ ప్రకాశవంతంగా ఉండాలి. అంధకారం ఎక్కువగా ఉంటే అది అశుభ పరిణామాలను కలిగించవచ్చు.

వ్యాపార ప్రదేశానికి వాస్తు నియమాలు

  • ఆకార రూపం.. వ్యాపార ప్రదేశం చతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి.
  • పూజా దిశ.. వ్యాపార ప్రదేశంలో పూజ చేస్తే తూర్పు వైపుగా తిరిగి చేయాలి.
  • దక్షిణ దిశ ప్రాముఖ్యత.. వ్యాపార ప్రదేశంలో దక్షిణ దిశ ఎక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది.

వాస్తు శాస్త్రాన్ని పాటించడం ద్వారా ఇంట్లో శుభఫలితాలు పొందవచ్చు. ఇంట్లో ఉండకూడని వస్తువులను తొలగించడం ద్వారా ఆర్థిక స్థిరత, కుటుంబ సౌఖ్యం పెరుగుతాయి.