రంగుల పండుగ హోలీ ఆనందానికి, వినోదానికి ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధి చెందిన భారతీయ పానీయం భాంగ్ తండై.. ముఖ్యంగా హోలీ పండుగ కోసం తయారు చేస్తారు భాంగ్ థండై హోలీలో ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. ఇది తాగిన తర్వాత తమకు ఉన్న అన్ని చింతలను మరచిపోయి మత్తులో నృత్యం చేస్తారు. రంగుల పండుగ హోలీ రోజున భాంగ్ తండై తాగే సంప్రదాయం ఎందుకు మొదలైందనే విషయం పౌరాణిక గ్రంథం శివపురాణంలోని ఒక పురాణ కథలో ఉంది. ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.
శివపురాణం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశ్యపు కుమారుడు ప్రహ్లాదుడు.. శ్రీ మహా విష్ణువు గొప్ప భక్తుడు. తన శత్రువైన విష్ణువుని పూజిస్తున్న తన తనయుడైన ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపు చంపాలని కూడా భావించాడు. అందుకే ప్రహ్లాదుడిని అతని తండ్రి అతన్ని అనేక రకాలుగా హింసించి చంపడానికి ప్రయత్నించాడు. హిరణ్యకశ్యపుని నుండి తన భక్తుని ప్రాణాలను కాపాడటానికి, విష్ణువు నరసింహ స్వామి రూపాన్ని ధరించి హిరణ్యకశ్యపుని సంహరించాడు. అయితే హిరణ్యకశ్యపుని చంపిన తర్వాత కూడా విష్ణువు అవారమైన నరసింహస్వామి ఆగ్రహం చల్లారలేదు.. అప్పుడు విష్ణువు కోపాన్ని చల్లార్చడానికి.. శివుడు శరభ అవతారాన్ని ధరించాడు.
శరభ అవతారంలో సగం పక్షి, సగం సింహం. ఇది సింహం కంటే శక్తివంతమైనది. ఎనిమిది కాళ్ళు కలిగి ఉంది. శివుని అవతారమైన శరభుడు విష్ణువు అవతారమైన నరసింహ స్వామిని ఓడించినప్పుడు.. నరసింహుని కోపం చల్లారింది. అప్పుడు నరసింహ స్వామి తన శరీరం నుండి సింహం చర్మాన్ని తొలగించి శరభకి ఆసనంగా సమర్పించాడు.
దీని తరువాత, కైలాశంలోని శివగణాలు ఆనందంతో పండగ జరుపుకున్నారు. భాంగ్ తాగారు.. ఉల్లాసంగా నృత్యం చేశారు. నేటికీ, భక్తులు హోలీ సందర్భంగా శివుడు.. విష్ణువు ఈ లీలాను స్మరిస్తూ ఉల్లాసంగా భాంగ్ తాగుతారు మరియు నృత్యం చేస్తారు. అప్పటి నుంచి హోలీ రోజున భాంగ్ తాగే సంప్రదాయం మొదలైంది.
భాంగ్ ఒక మూలికగా పరిగణించబడుతుంది. విశ్వాసం ప్రకారం సముద్ర మథనం సమయంలో శివుడు తన గొంతులో విషాన్ని నిలిపినప్పుడు.. ఆ విష ప్రభావం కారణంగా శివుడి శరీరంలో చాలా మంటలు వచ్చాయి. ఆ తరువాత విషం ప్రభావంతో ఏర్పడిన మంటలను తగ్గించేందుకు శివునికి జనపనార, ఉమ్మెత్త, నీరు సమర్పించారు.
భాంగ్ శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉన్నందున.. ఇది శివునికి మంట నుండి ఉపశమనం కలిగించింది. హోలీ సందర్భంగా ప్రజలు వివిధ రకాల వంటకాలు తింటారు. అటువంటి పరిస్థితిలో జనపనార జీర్ణ ఔషధంగా పనిచేస్తుంది. అంతే కాకుండా భాంగ్ సేవించడం వల్ల ప్రజలు ఆందోళన, ఒత్తిడి లేకుండా ఉండి స్వేచ్ఛగా పండుగను ఆస్వాదించగలుగుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు