హోలీ భారతదేశంలో చాలా ప్రసిద్ధ పండుగ. ఇది హిందువుల ప్రధాన పండుగలలో ఒకటి. హోలీ అనేది రెండు రోజుల పండుగ. హోలికా పూజ… హొలీ పండగ.. హోలికా దహన్‌తో ప్రారంభమవుతుంది. హోలికా దహనం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఈ రోజున హోలికా దహనం అగ్ని ద్వారా ప్రతికూల శక్తులు నాశనం అవుతాయని నమ్మకం. ఈ అగ్నిలో ఆవు పేడతో చేసిన పిడకలను వేసి దహనం చేస్తారు. ఎందుకంటే హొలీ దహనం రోజున ఆవు పేడ పిడకలను మంటల్లో వేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.
హిందూ మతంలో ఆవుకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. గోవుని హిందువులు అత్యంత పవిత్రంగా పూజిస్తారు. సకల దేవతలు నివసిస్తారు అని నమ్మకం. అందుకే ఆవు పేడ లేదా ఆవు పిడకలను కాల్చడం వల్ల వెలువడే పొగ ప్రతికూల శక్తులను దూరం చేయడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఈ కారణంగా ఆవు పేడతో చేసిన పిడకలను మతపరమైన ఆచారాల్లో కూడా ఉపయోగిస్తారు.
హోలికా దహన సమయంలో అగ్నిలో వేయడానికి ఆవు పేడతో పిడకలను తయారు చేస్తారు. ఇందుకోసం ఆవు పేడతో చిన్న చిన్న బంతులను తయారు చేసి మధ్యలో రంధ్రాలు చేసి వాటిని ఎండలో ఆరబెట్టి, వాటిని దండలు తయారు చేసి.. ఈ దండలను హోళిక అగ్నిలో వేస్తారు. వాటిని కాల్చడం వల్ల గృహ సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
హోలీ పండుగ సమయానికి శీతాకాలం ముగిసి వేసవి కాలం ప్రారంభం కానుంది. ఈ సమయంలో అనేక రకాల బ్యాక్టీరియా పెరిగే వాతావరణం ఉంది. ఈ బ్యాక్టీరియా ఆరోగ్యానికి హానికరం. ఈ బ్యాక్టీరియా వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పర్యావరణాన్ని శుద్ధి చేయడానికి పని చేసే కొన్ని మూలకాలు ఆవు పేడలో ఉంటాయి. అందువల్ల ఆవు పేడను కాల్చడం వల్ల పర్యావరణం శుద్ధి అవుతుంది. హానికరమైన బ్యాక్టీరియా నాశనం అవుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు