ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ పండుగను ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. గురు పూర్ణిమను ఆషాఢ పూర్ణిమ అని కూడా అంటారు. మానవాళికి మహాభారతం వంటి గొప్ప గ్రంథాన్ని అందించిన వేద వ్యాసుడు జన్మించిన రోజుని ఆషాడ మాసం పౌర్ణమి అని నమ్ముతారు. అందుకే ఈ రోజును వేద వ్యాసుడు జన్మదినంగా జరుపుకుంటారు. గురు పూర్ణిమ రోజున పూజలు, ఉపవాసం చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. దీనితో పాటు ఈ రోజున గురువులను ఆరాధించడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే ఈ ఏడాది గురు పూర్ణిమ జరుపుకునే తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. అటువంటి పరిస్థితిలో గురు పూర్ణిమ ఉపవాసం ఎప్పుడు ఆచరించవచ్చు.. శుభ సమయం, ప్రాముఖ్యత ,పూజా విధానం గురించి ఈ రోజు తెలుసుకుందాం.
పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని పౌర్ణమి తిధి జూలై 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ జూలై 21 సాయంత్రం 3:47 గంటలకు ముగుస్తుంది.
శాస్త్రాల ప్రకారం చంద్రోదయ సమయాన్ని అది కూడా రాత్రి పౌర్ణమి తిది ఉన్న రోజుని మాత్రమే పూర్ణిమ తిథిగా భావిస్తారు. అంతేకాదు ఈ రోజునే పున్నమి ఉపవాసం ఆచరిస్తారు. పూర్ణిమ తిథి ఎప్పుడు రాత్రి ఉంటుందో ఆ రోజున ఉపవాసం, పూజలు చేస్తారు. అటువంటి పరిస్థితిలో జూలై 20న గురు పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకోనున్నారు. ఈ రోజు వ్రతం ఆచరించి మర్నాడు అంటే జూలై 21వ తేదీ న గురు పౌర్ణమి మిగుల తిధి సందర్భంగా దానధర్మాలు చేయడం మంచిది అని పండితులు సూచిస్తున్నారు.
పౌరాణిక విశ్వాసాల ప్రకారం గురు పూర్ణిమను మహాభారతాన్ని రచించిన మహర్షి వేదవ్యాసుడి పుట్టినరోజుగా జరుపుకుంటారు. అందుకే ఈ రోజును వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున వేదవ్యాసుడి నాలుగు వేదాలను రచించాడని నమ్ముతారు. ఈ రోజున గురువు తన శిష్యులకు కూడా దీక్షను ఇస్తాడు. ఈ రోజున ప్రతి ఒక్కరూ తమ గురువులను పూజిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు