Geeta Jayanti 2023: భగవద్గీత ఓ పుస్తకం కాదు.. అదొక జీవన సారం.. చదవానికి కూడా కొన్ని నియమాలున్నాయని తెలుసా..!

|

Dec 22, 2023 | 8:37 AM

గీత లేదా మరేదైనా హిందూ మత గ్రంథాన్ని సాధారణ పుస్తకంలా చదవరు. అలా చేయడం వల్ల పాఠకులకు  ఎలాంటి ప్రయోజనం ఉండదు. గీత చదవడానికి ఈ 4 దశలు ఉన్నాయి. మొదటిది చదవడం లేదా వినడం, రెండవది ధ్యానం చేయడం లేదా ఆలోచించడం.. మూడవది చదివిన దాని ఆధారంగా జీవితంలో తప్పు,  ఒప్పులను గుర్తించడం..  చివరకు జీవితంలో ఆ విషయాలను అమలు చేయడం.

Geeta Jayanti 2023: భగవద్గీత ఓ పుస్తకం కాదు.. అదొక జీవన సారం.. చదవానికి కూడా కొన్ని నియమాలున్నాయని తెలుసా..!
Geeta Jayanti
Follow us on

హిందూ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాల్లో భగవద్గీత కి విశిష్ట స్థానం ఉంది. గీతను పవిత్ర గ్రంథంగా భావించి పూజిస్తారు. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు .. తాను పోరాడాల్సింది తన సొంత కుటుంబ సభ్యులే అని .. తన ముందు ఉన్న వారిని చూసినప్పుడు.. వారితో తనకు ఉన్న  అనుబందాన్ని గుర్తు చేసుకుంటూ యుద్ధం చేయడానికి నిరాకరించాడు. అప్పుడు ఈ యుద్ధం కేవలం కౌరవులకు పాండవుల మధ్య మాత్రమే కాదని.. ఇది ధర్మానికి.. అధర్మానికి మధ్య జరిగే యుద్ధం అని శ్రీ కృష్ణుడు అర్జునుడికి వివరించాడు. అర్జునుడు బాధను చూసిన శ్రీ కృష్ణుడు అప్పుడు కృష్ణుడు చెప్పిన విషయాలను భగవత్ గీత అని భావిస్తారు.

నేటికీ గీతలో వ్రాయబడిన ఈ శ్లోకాలకు అదే శక్తి ఉంది. గీత శ్లోకాలను చదివి అర్థం చేసుకున్న వ్యక్తి ప్రపంచంలోని ప్రతి బాధ, భ్రమ నుండి విముక్తి పొందుతాడు. గీతా పఠనానికి కొన్ని నియమాలు కూడా చెప్పబడ్డాయి. గీతను చదవడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుని.. తద్వారా గీత గురించి పూర్తి జ్ఞానాన్ని పొందవచ్చు.

గీతా పఠన నియమం ఏమిటంటే?

గీత లేదా మరేదైనా హిందూ మత గ్రంథాన్ని సాధారణ పుస్తకంలా చదవరు. అలా చేయడం వల్ల పాఠకులకు  ఎలాంటి ప్రయోజనం ఉండదు. గీత చదవడానికి ఈ 4 దశలు ఉన్నాయి. మొదటిది చదవడం లేదా వినడం, రెండవది ధ్యానం చేయడం లేదా ఆలోచించడం.. మూడవది చదివిన దాని ఆధారంగా జీవితంలో తప్పు,  ఒప్పులను గుర్తించడం..  చివరకు జీవితంలో ఆ విషయాలను అమలు చేయడం.

ఇవి కూడా చదవండి

ఈ నాలుగు దశలను పదే పదే అభ్యసించిన తర్వాత మాత్రమే గీత గురించి సరైన జ్ఞానాన్ని పొందవచ్చు. గీత ఒక్కసారి చదివి వదిలేసే పుస్తకం కాదు.. గీతను ఎన్నిసార్లు చదివితే అంత చైతన్యం కలుగుతుంది.  ఎందుకంటే గీతను  మొదటి సారి చదినప్పుడు గీతాసారం అర్థం కాకపోవచ్చు. అందుకనే గీతను మళ్ళీ మళ్ళీ చదవడం వలన జీవిత అర్ధాన్ని పరమార్ధం గురించి తెలుసుకోగలరు. మొదటిసారి అర్థం చేసుకోలేరు. అందుకే గీత చదివిన ప్రతిసారీ సరికొత్తగా ఏదొక విషయం తెలిసినట్లు అనిపిస్తుంది.

గీతలో ఏది చదివినా దాని గురించి ఆలోచిస్తూ, ధ్యానం చేస్తూ ఉండండి. ఆలోచించడం ద్వారా జీవితంలో ఏ పరిస్థితుల్లో ఏది సరైనది..  ఏది తప్పు అనేది అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. అప్పుడు గీత నుండి ఏమి నేర్చుకున్నారో దానిని జీవితంలో అమలు చేయడనికి ప్రయత్నించండి. గీతా జ్ఞానం ప్రకారం ప్రవర్తించండి. ఇలా చేయడం ద్వారా అర్జునుడికి ఎలా మానవ జీవితం అంటే భ్రమలు తొలగి జ్ఞానం కలిగిందో.. అదే విధంగా గీత సారాన్ని జీవితానికి అన్వయించుకోగలరు. అయితే చాలామంది భగవద్గీత చదువుతారు. కానీ ఎంతమందికి గీత సారానికి సంబంధించిన నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు