
హిందూ మతంలో ఆహారాన్ని ప్రసాదం వలె పవిత్రంగా భావిస్తారు. మన పురాణ గ్రంథాలు అన్నం పరబ్రహ్మ అంటే ఆహారం బ్రహ్మ అని చెబుతున్నాయి. అన్నపూర్ణ దేవిని ఆహారానికి అధిష్టాన దేవతగా భావిస్తారు, కనుక ప్రతి ధాన్యం దైవత్వంతో ముడిపడి ఉంటుంది. ఆహారం ఎంత పవిత్రంగా ఉంటే.. దాని వినియోగానికి సంబంధించిన నియమాలు అంత కఠినంగా ఉంటాయి. నేల మీద పడిన ఆహారం మానవులు తినడం నిషిద్ధమని మత గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఎందుకంటే అది అదృశ్య జీవుల ఆహారం. ఈ విషయంలో గరుడ పురాణం ఏమి చెప్పిందంటే..
గరుడ పురాణంలోని ప్రీత ఖండం ప్రకారం నేలపై పడిన ఆహారం వెంటనే అపవిత్రంగా మారుతుంది. నేల మీది పడిన ఆహారం ఇకపై దేవతలకు లేదా మానవులకు చెందదు. బదులుగా దయ్యాలు, పిశాచాలు , బ్రహ్మరాక్షసులకు ఆహారంగా మారుతుంది. అందువల్ల ఎవరైనా నేల మీద పడిన ఆహరాన్ని తీసుకుంటే.. వారిలోని ధర్మ నిరతి తగ్గిపోతుందని, జీవితంలో అడ్డంకులు పెరుగుతాయని చెబుతారు. మత గ్రంథాల ప్రకారం పడిన ఆహారాన్ని తినడం వల్ల ఒక వ్యక్తి మనస్సు కలవరపడుతుంది. ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుంది. అందుకే సాధువులు, ఋషులు ఇలాంటి ఆహరాన్ని బ్రహ్మరాక్షసుల ఆహారంలో భాగంగా పరిగణించి దానిని నివారించమని సలహా ఇస్తారు.
నేటికీ గ్రామాల్లో చిందిన ఆహారం బ్రహ్మరాక్షసులదేనని ఒక ప్రసిద్ధ నానుడి ఉంది. నేల మీద పడిన ఆహారం తింటే బ్రహ్మరాక్షసుల వల్ల ప్రభావితమవుతారని పెద్దలు నమ్ముతారు. ఈ భయం, దైవం మీద భక్తి కారణంగా, ప్రజలు ఇప్పటికీ నేల మీద పడిన ఆహారాన్ని జంతువులు, పక్షులు లేదా భూమి దేవికి అర్పిస్తారు. వాస్తవానికి ఈ సంప్రదాయం సామాజిక క్రమశిక్షణను బోధిస్తుంది. ఇది ఆహారాన్ని గౌరవించాలని, మనది కాని ఆహారాన్ని గౌరవంగా విస్మరించాలని నేర్పుతుంది. నేటికీ ఈ నియమం మత విశ్వాసాలకు ప్రతీకగా మాత్రమే కాదు ఆరోగ్యం, పరిశుభ్రతకు కూడా సంబంధించినది. వైద్యులు, శాస్త్రవేత్తలు కూడా హానికరమైన బ్యాక్టీరియా, ధూళి కణాలు చిందిన ఆహారంలోకి చేరుకుంటాయని.. ఇలాంటి ఆహారం తినడం వలన కడుపు, పేగు వ్యాధులకు కారణమవుతుందని అంటున్నారు. అందువల్ల నేల మీద పడిన ఆహారాన్ని తినడం హానికరమని మతం, శాస్త్రం రెండూ అంగీకరిస్తున్నాయి.
గ్రంథాలు, ప్రజాదరణ పొందిన నమ్మకం, ఆధునిక శాస్త్రం అన్నీ నేల మీద పడిన ఆహారం మానవులు తినడానికి తగినది కాదని అంగీకరిస్తున్నాయి. దీనిని అదృశ్య జీవులలో ఒక భాగంగా పరిగణిస్తారు. ఈ నమ్మకాన్ని గౌరవించి జంతువులు, పక్షులకు ఈ ఆహారాన్ని అందించడం ఉత్తమ పరిష్కారంగా భావించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు