హిందూ మతంలో ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడింది. అదేవిధంగా శుక్రవారం సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని పూజించే రోజుగా పరిగణించబడుతుంది. అలాగే శుక్రవారం రోజున వైభవ లక్ష్మీవ్రతం పాటిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనిషి జీవితంలోని ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం. అలాగే ఆదాయం పెరుగుతుంది. అదృష్టం వీరి సొంతం. స్త్రీ, పురుషులు ఇద్దరూ వైభవ లక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చు. మీరు మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఇబ్బంది పడుతుంటే, శుక్రవారం ఉదయం స్నానం చేసి, ధ్యానం చేసి, నియమ నిష్ఠల ప్రకారం లక్ష్మీ దేవిని పూజించండి. అంతేకాదు శుక్రవారం పూజ సమయంలో లక్ష్మీ దేవికి సంబంధించిన 108 నామాల మంత్రాన్ని జపించండి.
శుక్రవారం రోజున అభ్యంగ స్నానం, ధ్యానం చేసిన తరువాత సంపదకు అధిదేవత అయిన లక్ష్మీ దేవిని, విష్ణువును పూజించండి. అప్పుడు లక్ష్మీ దేవికి, విష్ణువుకు బియ్యంతో చేసిన పాయసాన్ని సమర్పించండి. బియ్యంతో చేసిన పాయసం లక్ష్మీ దేవికి చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పరిహారం చేయడం ద్వారా లక్ష్మీ దేవి ఆశీర్వాదం లభిస్తుందని అతని జీవితంలో సిరి సంపదలు, సుఖ సంతోషాలు ఉంటాయని నమ్మకం.
సంపదలకు దేవత అయిన లక్ష్మిదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. శుక్రవారం రోజున ఆలయానికి వెళ్లి లక్ష్మీదేవికి, శ్రీ మహా విష్ణువుకి కొబ్బరికాయను సమర్పించాలి. ఇలా నియమనిష్టలతో శుక్రవారం లక్ష్మీదేవితో పూజ చేస్తే ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..