Astro Tips: పసుపుతో ఇలా పూజచేస్తే.. ఆర్థికాభివృద్ధితో పాటు.. మీ ఇంట డబ్బు వర్షం కురుస్తుంది..!

|

Jan 11, 2023 | 8:18 PM

ఇది అనేక రకాల ఆరాధన, పూజాది కార్యక్రమాలలో కూడా ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే ఈ రోజు మనం కొన్ని ఎఫెక్టివ్ రెమెడీస్, పసుపు నివారణ మార్గలను తెలుసుకుందాం..

Astro Tips: పసుపుతో ఇలా పూజచేస్తే.. ఆర్థికాభివృద్ధితో పాటు.. మీ ఇంట డబ్బు వర్షం కురుస్తుంది..!
turmeric
Follow us on

కొన్నిసార్లు అదృష్టం కలిసిరాకపోవడం వల్ల ప్రతి పనిలోనూ అపజయం ఎదురవుతుంది. దీనికి వాళ్ల బ్యాడ్‌లక్‌ కారణం కావచ్చు. కానీ జ్యోతిష్య శాస్త్రంలో అదృష్టాన్ని అందించడానికి, అపసవ్య దోషాన్ని సరిదిద్దడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ నివారణలలో పసుపు కూడా ఒకటి. ఆయుర్వేదంలో పసుపుకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. అంతేకాదు.. పసుపు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది అనేక రకాల ఆరాధన, పూజాది కార్యక్రమాలలో కూడా ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే ఈ రోజు మనం కొన్ని ఎఫెక్టివ్ రెమెడీస్, పసుపు నివారణ మార్గలను తెలుసుకుందాం.. ఇది మిమల్నీ అదృష్టం వైపు నడిపిస్తుంది.

పసుపు ముడి..
బుధవారం లేదా గురువారం గణేశుడికి పసుపు ముడుల హారాన్ని సమర్పించండి. ఇది మీ విజయ మార్గంలో వచ్చే అన్ని రకాల అడ్డంకులను తొలగిస్తుంది. ఒక ఎర్రటి గుడ్డలో పసుపు ముడి వేసి ప్రతిరోజూ పూజించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది.

చెడు దృష్టి..
పసుపు విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. అందుకే పసుపు పద్ధతులు గురువారం మరింత ప్రభావవంతంగా పరిగణించబడతాయి. చెడు కన్ను పారద్రోలడానికి పసుపు ముడిని మీ తలపై పెట్టుకుని నిద్రించండి. ఇది మీపై ఉన్న చెడు దృష్టిని తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

వివాహంలో ఇబ్బంది..
పసుపు నివారణలతో బృహస్పతి సంతోషిస్తుంది. ఇందుకోసం గురువారం నాడు శనగలు, పసుపును దానం చేయండి. ఇలా చేయడం వల్ల విష్ణువు కూడా సంతోషిస్తాడు. మరోవైపు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాల ముందు రోజూ చిటికెడు పసుపును నైవేద్యంగా పెడితే వివాహ సమస్యలు తొలగిపోతాయి.

రుణ డబ్బు..
వేరొకరికి అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందడానికి, పసుపుతో ఎర్రటి గుడ్డలో బియ్యం కట్టి మీ పర్సులో ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల మీ డబ్బు తిరిగి వస్తుంది. ఏదైనా శుభ కార్యం కోసం ఇంటి నుండి బయలుదేరే ముందు , వినాయకుడికి పసుపు తిలకం రాసి, ఆపై మీ నుదిటిపై కూడా పెట్టుకోండి. ఇది మీకు పనిలో విజయాన్ని కలిగిస్తుంది.

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..