
సెప్టెంబర్ 2025 నెల ఖగోళ దృక్కోణంలో చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలో రెండు పెద్ద గ్రహణాలు ఏర్పడనున్నాయి. చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న, సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న. వీటిల్లో చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. కనుక ఆధ్యాత్మికంగా, జ్యోతిషశాస్త్ర దృక్కోణంలో ఈ గ్రహణం ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. గ్రహణం రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, అయితే ఈ గ్రహణ సమయం గర్భిణీ స్త్రీలకు చాలా సున్నితంగా పరిగణించబడుతుంది. గ్రహణం ప్రతికూల శక్తి పుట్టబోయే బిడ్డను త్వరగా ప్రభావితం చేస్తుందని పురాణ గ్రంథాలలో స్పష్టంగా చెప్పబడింది. అందుకే గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాలి.
సెప్టెంబర్ 2025 లో సంభవించే రెండో చంద్ర గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో ఇంట్లో నుంచి బయటకు రాకుండా విశ్రాంతి తీసుకోవాలి. మంత్రాలు పఠిస్తూ.. ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుతూ గడిపినట్లయితే, గ్రహణం గర్భిణీ స్త్రీలపై, వారికి పుట్టబోయే బిడ్డపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని విశ్వాసం.
గ్రహణ సమయంలో వెలువడే కాస్మిక్ కిరణాలు గర్భిణీ స్త్రీలు, వారి పుట్టబోయే బిడ్డపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయని ఆయుర్వేదం చెబుతోంది. అందువల్ల గ్రహణ సమయంలో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని.. దర్భలను తమతో ఉంచుకోవాలని సూచిస్తారు. అంతేకాదు మంత్రాలను జపించడం ద్వారా రక్షణ లభిస్తుంది. గ్రహణం వల్ల శారీరక హాని జరుగుతుందని ఎటువంటి ఆధారాలు లేవని ఆధునిక శాస్త్రం నమ్ముతుంది, కానీ సాంప్రదాయ నియమాలను పాటించడం వల్ల గర్భిణీ స్త్రీకి మానసిక ప్రశాంతత, విశ్వాసం లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.