Swapna Shastra: ఇలాంటి కలలు పదేపదే వస్తున్నాయా.. మీ భవిష్యత్ ప్రమాదంలో ఉందని అర్ధం.. తస్మాత్ జాగ్రత్త..

ప్రతి ఒక్కరికీ నిద్ర పోయే సమయంలో కలలు వస్తాయి. ఈ కలలకు మానవ జీవితానికి సంబంధం ఉందని స్వప్న శాస్త్రం పేర్కొంది. కలలు భావోద్వేగాలు. కొన్ని కలలు నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత చెదిరిపోతాయి. కొన్ని రకాల కలలు తరచుగా వస్తూ.. మనసుని లోతైన గాయం చేస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం ఒక్కో కలకి ఒక్కో అర్థం ఉంది. అదే విధంగా పర్వతాల నుంచి లేదా పైకప్పుల నుంచి కిందకు పడిపోతున్నట్లు మీరు తరచుగా కలలు కంటున్నారా? జాగ్రత్త.. భవిష్యత్ లో పెను ప్రమాదం రానుందని హెచ్చరిక అట.

Swapna Shastra: ఇలాంటి కలలు పదేపదే వస్తున్నాయా.. మీ భవిష్యత్ ప్రమాదంలో ఉందని అర్ధం.. తస్మాత్ జాగ్రత్త..
Swapna Shastram

Updated on: Mar 24, 2025 | 12:08 PM

కలలు కనడం మన చేతుల్లో లేదు. మనం నిద్రలో ఏమి కలలు కంటామో అది మన నియంత్రణకు మించినది. మనం నిద్రపోతున్నప్పుడు వచ్చే కలలలో మెలకువ వచ్చిన తర్వాత చాలా వరకు మర్చిపోతాము. కానీ కొన్ని కలలు మన మనస్సులపై ఒక ముద్ర వేస్తాయి. పదే పదే ఒకే కల రావడం వలన ఆ కలల నుంచి బయటపడలేము. దాదాపు ఇలాంటి అనుభవం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. అదే విధంగా ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడుతున్నట్లు కల వచ్చినా.. పర్వతం పై నుంచి లేదా ఇంటి పైకప్పు లేదా మెట్లపై నుంచి పడటం వంటి కలలు రావడం సర్వ సాధారణం. దాదాపు మనందరికీ ఏదో ఒక సమయంలో ఇలాంటి కల వస్తూనే ఉంటుంది. ఇలాంటి కలను చూసిన వెంటనే మనం మేల్కొంటాము. అయితే ఇలాంటి కలలు ఎందుకు వస్తాయి? దాని వెనుక కారణం ఏమిటి? అన్న వివరణ స్వప్న శాస్త్రంలో ఉంది.

  1. ఇంటి పైకప్పు నుంచి లేదా ఎత్తైన భాగం నుంచి కిందకు పడిపోతున్నట్లు కలలు కనడం అంత మంచిది కాదు. ఈ రకమైన కల భవిష్యత్తులో కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరగనున్నాడని ముందస్తు సూచన. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇటువంటి కల కనిపిస్తే.. ఆ ప్రభావం ఇంట్లో ఉండే ప్రతి సభ్యుడి మీద ఉంటుంది.
  2. పై నుంచి కిందకు పడిపోయినట్లు కలలు కనడం అనేక ఇతర విషయాలను కూడా సూచిస్తుంది. ఎత్తు నుంచి కిందకు పడిపోవడం ఒక ప్రమాదంగా పరిగణించబడుతుంది. కనుక ఈ విషయాన్ని తేలికగా తీసుకోకూడదు. అలాంటి కలలు భవిష్యత్తులో జరిగే ప్రమాదాలను సూచిస్తాయి. కనుక జాగ్రత్తగా ఉండండి.
  3. నిద్రలో పర్వత శిఖరం నుంచి పడిపోతున్నారా? ఈ రకమైన కల అస్సలు మంచిది కాదు. ఇలాంటి కల భవిష్యత్తులో రాబోయే ఇబ్బందులను సూచిస్తుంది. సాధారణంగా ఈ రకమైన కల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు రానున్నయని ముందస్తు హెచ్చరిక. ఈ రకమైన కల జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుంది.
  4. మెట్లపై నుంచి పడిపోతున్నట్లు కలలు కనడం కూడా మంచిది కాదు. ఈ రకమైన కల కూడా భవిష్యత్ గురించి కొంత సూచనను ఇస్తుంది. అలాంటి కలలను పదే పదే చూడటం అంటే మీకు ఆత్మవిశ్వాసం లేదని అర్థం.
  5. అదేవిధంగా జారిపడిపోతున్నట్లు కలలు కనడం అస్సలు మంచిది కాదు. భవిష్యత్తులో మనం ప్రియమైన వ్యక్తి చేతిలో మోసానికి గురయ్యే అవకాశం ఉందని అలాంటి కలలు సూచిస్తున్నాయి. మీకు ఇలాంటి కలలను చూసినట్లయితే మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు