శని దేవుడి ఆశీస్సులతో మీ జీవితం మారిపోతుంది.. ఈ 5 పనులు చేయండి

శనిదేవుడికి ప్రత్యేక పూజలు, ఉపవాసాలు ఆచరించి స్మరించుకుంటే జీవితంలో అన్ని దు:ఖాలు, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఏడాదిలో మొదటి శనివారంనాడు కొన్ని పనులు చేయడం ద్వారా శనిదేవుడి ఆశీస్సులను ఏడాది పొడవునా చెప్పవచ్చు. పండితులు చెప్పిన ప్రకారం శనివారంనాడు ముఖ్యంగా ఈ ఐదు పనులు చేస్తే శనిదేవుడి ఆశీస్సులతో మీరు శుభఫలితాలను పొందుతారు.

శని దేవుడి ఆశీస్సులతో మీ జీవితం మారిపోతుంది.. ఈ 5 పనులు చేయండి
Shani Dev

Updated on: Jan 03, 2026 | 12:34 PM

నూతన సంవత్సరం ప్రారంభమై మూడు రోజులు గడిచిపోయాయి. ఈ రోజు కొత్త సంవత్సరంలో తొలి శనివారం. శనివారం శని దేవుడికి అంకితం చేయబడింది. అందుకే శనివారాల్లో ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తారు. శనిదేవుడికి ప్రత్యేక పూజలు, ఉపవాసాలు ఆచరించి స్మరించుకుంటే జీవితంలో అన్ని దు:ఖాలు, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.

శనిదేవుడి ఆశీస్సులు ఏడాది పొడవునా ఉండాలనే పలు ప్రత్యేక కర్మలు చేయాలని పండితులు చెబుతున్నారు. దీంతో జీవితంలో పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయని అంటున్నారు. కొత్త ఏడాదిలో శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు శనివారంనాడు ఏ విధమైన ప్రత్యేక కర్మలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవ నూనె దీపం

శనివారంనాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి. ఆ తర్వాత శని దేవుడి ఆలయాన్ని సందర్శించి.. నల్లటి వత్తితో ఆవనూనె దీపం వెలిగించండి. మొదటి శనివారం ఇలా చేయడం వల్ల సంవత్సరం పొడవునా శనిదేవుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.

దానాలు చేయండి

మొదటి శనివారంనాడు దాన ధర్మాలు చేయడం మర్చిపోవద్దు. దానాలు చేయడం చాలా పుణ్యప్రదం. శనివారంనాడు శని దేవుడిని పూజించడంతోపాటు పేద లేదా అవసరంలో ఉన్నవారికి నువ్వులు దానం చేయాలి. ఇతర పదార్థాలు కూడా దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ జాతకంలోని శని శక్తి బలపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

ఆవనూనె దానం

సంవత్సరంలో మొదటి శనివారం ఇనుప పాత్రలో ఆవనూనె నింపి, దానిలో ముఖం చూసుకోండి. ఆ తర్వాత దాన్ని పేదవారికి దానం చేయండి. అలా చేయడం వల్ల మీ జీవితం నుంచి ప్రతికూలత తొలగిపోతుంది. విజయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.

కొబ్బరికాయను ఇలా చేయండి

సంవత్సరంలో మొదటి శనివారంనాడు ఒక కొబ్బరికాయను కొట్టి.. దానిలో చక్కెర, పిండిని నింపండి. ఆ తర్వాత సాయంత్రం ఆ కొబ్బరికాయను ఏకాంత ప్రదేశంలో మట్టిలో పాతిపెట్టండి. అలా చేయడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోయి ఉపశమనం లభిస్తుంది.

శని స్తోత్ర పారాయణం

శనివారం రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత శని స్తోత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలా చేయడం వల్ల శనిదేవుడు మీ పట్ల ప్రసన్నుడవుతాడు. ఇది శని ప్రతికూల ప్రభావం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీంతో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు.

Note: ఈ వార్తలోని సమాచారం కేవలం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. TV9 తెలుగు దీనిని ధృవీకరించదు.