Get Rid of Negative Energy: ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేందుకు ఇలా చేయండి..

|

Aug 06, 2024 | 6:54 PM

ఎంత కష్ట పడినా ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదా? ఎప్పుడూ బాధ పడుతూ నిరాశకు గురవుతున్నారా? ఇంట్లో చికాకులు బాగా ఎక్కువ అవుతున్నాయా.. ఇందుకు ముఖ్య కారణం.. నెగిటివ్ ఎనర్జీ. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏ పని తలపెట్టినా మధ్యలోనే నిలిచి పోతుంది. కుటుంబంలో గొడవలు, కలహాలు ఎక్కువ అవుతాయి. డబ్బు పరంగా కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఎప్పుడూ నిరాశ, దుఃఖంతో ఇబ్బందులు..

Get Rid of Negative Energy: ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేందుకు ఇలా చేయండి..
Negative Energy
Follow us on

ఎంత కష్ట పడినా ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదా? ఎప్పుడూ బాధ పడుతూ నిరాశకు గురవుతున్నారా? ఇంట్లో చికాకులు బాగా ఎక్కువ అవుతున్నాయా.. ఇందుకు ముఖ్య కారణం.. నెగిటివ్ ఎనర్జీ. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏ పని తలపెట్టినా మధ్యలోనే నిలిచి పోతుంది. కుటుంబంలో గొడవలు, కలహాలు ఎక్కువ అవుతాయి. డబ్బు పరంగా కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఎప్పుడూ నిరాశ, దుఃఖంతో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా మంచిది. అంతే కాకుండా ఇంట్లో ఉండే వాస్తు దోషాలు కూడా తొలగి పోతాయి. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కలశాన్ని ఈ దిక్కులో ఉంచండి:

ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తిని తొలగించే శక్తి కలశానికి ఉంది. ఈశాన్య మూలలో కలశాన్ని ఉంచి వినాయకుడి స్వరూపంగా భావించి పూజించాలని, కలశాన్ని ప్రతిష్టించి వినాయకుడిని పూజిస్తే నెగిటివ్ శక్తి తొలగిపోతుంది. ఆ తర్వాత ఈ నీటిని మొక్కలకు వేయవచ్చు.

ఉప్పు:

నెగిటివ్ శక్తిని తొలగించడంలో ఉప్పు ఎంతో చక్కగా సహాయ పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఉప్పు నీళ్లతో తుడవడం, ఉప్పును మీ ఇంటి మూలల్లో వేయడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి తొలగుతుంది.

ఇవి కూడా చదవండి

పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రం:

ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో ఈ చిట్కా కూడా చక్కగా సహాయ పడుతుంది. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రం పెట్టండి. ఈ ఫొటో పెట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది.

కర్పూరం:

కర్పూరంతో కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటకు తరిమి కొట్టవచ్చు. ప్రతి రోజూ సాయంత్రం కర్పూరాన్ని వెలిగించి.. ఇంటి మూలలో, ఇంటి ప్రవేశ ద్వారానికి చూపించండి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ధూపం వెలిగించడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)