
హిందూ మతంలో దీపావళి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున లక్ష్మీదేవితో పాటు గణేశుడిని పూజించే సంప్రదాయం ఉంది. లక్ష్మీ దేవికి స్వాగతం చెబుతూ దీపావళి పండగను జరుపుకోవడానికి ఇప్పటికే ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు పేర్కొన్నారు. వీటిని పాటించడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళికి ముందు లేదా దీపావళి రోజున కొన్ని ప్రత్యేక మొక్కలను ఇంట్లో నాటవచ్చు. వీటిని ఇంట్లో పెట్టుకుంటే మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. దీనితో పాటు సిరి సంపదలు, సానుకూల శక్తి పెరుగుదల ఉంటుంది. దీపావళి రోజున శుభప్రదంగా ఉండాలంటే ఏయే మొక్కలు నాటాలో తెలుసుకుందాం..
లక్కీ ప్లాంట్
దీపావళి సందర్భంగా ఇంట్లో లక్కీ ప్లాంట్ ను పెంచుకోవచ్చు. ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల అదృష్టం వస్తుంది. అంతేకాదు ప్రతి రంగంలో విజయం సొంతం అవుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడితే తిరిగి ప్రారంభమవుతాయి. ఈ మొక్కను ఆగ్నేయ దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
తులసి మొక్క
కార్తీక మాసంలో తులసి మొక్క అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీపావళి రోజున దీనిని నాటితే చాలా రెట్లు ఎక్కువ ఫలాలు వస్తాయి. ఇంట్లో పెట్టుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ వేగంగా పెరుగుతుంది. దీనితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రతి రంగంలో విజయాలు, సంపదలు పెరుగుతాయి.
శంఖం పువ్వు
దీపావళి సందర్భంగా ఇంట్లో అపరాజిత లేదా శంఖం పువ్వు మొక్కను నాటవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో నాటడం ద్వారా లక్ష్మీదేవి చాలా సంతోషంగా ఉంటుంది. సిరి సంపదలు కలుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు, ఉత్తరం, ఈశాన్య దిశలో అపరాజిత మొక్కను నాటడం శుభప్రదం. అంతేకాదు ప్రధాన ద్వారానికి కుడి వైపున ఉంచడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
జాడే మొక్క
వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళి రోజున సంపద, శ్రేయస్సు , ఆనందాన్ని ఇచ్చే ఈ మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంట్లోనే కాకుండా ఆఫీసులో కూడా జాడే మొక్కను పెంచుకోవడం శుభప్రదం. దీనివల్ల వ్యాపారంలో వృద్ధితోపాటు ఆర్థిక లాభం కూడా ఉంటుంది. మీరు దీన్ని మీ ఇంటిలోని తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు