AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ట్రిప్‌లో తమిళనాడు పుణ్యక్షేత్రాలు.. IRCTC ప్రత్యేక యాత్రకు ఇప్పుడు బుక్ చేయండి!

Tamil Nadu Pilgrimage Tour: భక్తుల కోసం శుభవార్త! తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించాలనుకునే వారికి IRCTC ప్రత్యేకంగా “దివ్య దక్షిణ యాత్ర – అరుణాచలం, చిదంబరం” టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ యాత్రకు సంబంధించిన ముఖ్య వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకే ట్రిప్‌లో తమిళనాడు పుణ్యక్షేత్రాలు.. IRCTC ప్రత్యేక యాత్రకు ఇప్పుడు బుక్ చేయండి!
Tamil Nadu Pilgrimage Tour
Rajashekher G
|

Updated on: Mar 22, 2026 | 6:11 PM

Share

దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీను తీసుకొచ్చింది. “దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం – చిదంబరం” పేరుతో, ఇది భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ (Bharat Gaurav Tourist Train) ద్వారా నిర్వహించబడుతుంది. మొత్తం 8 రోజుల, 7 రాత్రుల పర్యటన, మే 24న హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో తిరువణ్ణామలై (అరుణాచలం) – ప్రసిద్ధ ఆలయం దర్శనం, రామేశ్వరం (Rameswaram) – శ్రీ రామనాథస్వామి ఆలయం, మధురై (Madurai) – మీనాక్షి అమ్మవారి ఆలయం, షాపింగ్, కన్యాకుమారి (Kanyakumari) – వివేకానంద రాక్ మెమోరియల్‌, గాంధీ మండపం, తిరుచ్చి (Tiruchi) – శ్రీరంగనాథస్వామి ఆలయం, తంజావుర్ (Thanjavur) – బృహదీశ్వర ఆలయం, చిదంబరం (Chidambaram) – నటరాజ స్వామి దర్శనం మొదలైన ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనం చేసుకోవచ్చు. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • ఈ ప్యాకేజీ యాత్ర వ్యవధి: 8 రోజులు, 7 రాత్రులు
  • ప్రారంభ ధర: రూ.14,500 నుంచి
  • ప్రయాణ తరగతులు: స్లీపర్, 3ఏసీ, 2ఏసీ

యాత్రలో సందర్శించే ప్రధాన క్షేత్రాలు & ప్రదేశాలు:

  • తిరువణ్ణామలై (అరుణాచలం) – ప్రసిద్ధ ఆలయం దర్శనం
  • రామేశ్వరం (Rameswaram) – శ్రీ రామనాథస్వామి ఆలయం
  • మధురై (Madurai) – మీనాక్షి అమ్మవారి ఆలయం, షాపింగ్
  • కన్యాకుమారి (Kanyakumari) – వివేకానంద రాక్ మెమోరియల్‌, గాంధీ మండపం
  • తిరుచ్చి (Tiruchi) – శ్రీరంగనాథస్వామి ఆలయం
  • తంజావుర్ (Thanjavur) – బృహదీశ్వర ఆలయం
  • చిదంబరం (Chidambaram) – నటరాజ స్వామి దర్శనం

యాత్ర షెడ్యూల్ (సారాంశం):

  • మొదటి రోజు: సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రయాణం ప్రారంభం
  • రెండో రోజు: అరుణాచలం చేరి దర్శనం, రామేశ్వరం వైపు ప్రయాణం
  • మూడో రోజు: కుడల్ నగర్, రామేశ్వరం ఆలయం దర్శనం, బస
  • నాలుగో రోజు: మధురై – మీనాక్షి అమ్మవారి దర్శనం, షాపింగ్
  • ఐదో రోజు: కన్యాకుమారి – వివేకానంద రాక్ మెమోరియల్‌, గాంధీ మండపం
  • ఆరవ రోజు: తిరుచిరాపల్లి – శ్రీరంగనాథస్వామి ఆలయం, తంజావూర్ – బృహదీశ్వర ఆలయం
  • ఏడో రోజు: చిదంబరం – నటరాజ స్వామి దర్శనం, రాత్రి సికింద్రాబాద్ వైపు తిరుగు ప్రయాణం
  • ఎనిమిదో రోజు: రాత్రికి సికింద్రాబాద్ చేరుకొని యాత్ర ముగింపు
  • ప్యాకేజీ ధరలు:

తరగతి పెద్దవారి ధర పిల్లల ధర

  • స్లీపర్ రూ.14,500 రూ.13,500
  • 3ఏసీ రూ.21,700 రూ.20,600
  • 2ఏసీ రూ.27,900 రూ.26,600

ప్యాకేజీ సదుపాయాలు:

  • ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి శాకాహార భోజనం
  • హోటల్ బస, వాహన సౌకర్యం
  • ట్రావెల్ ఇన్సూరెన్స్

గమనిక: కొన్ని ప్రదేశాల్లో ప్రవేశ రుసుములు, అదనపు సదుపాయాల ఖర్చులు వ్యక్తిగతంగా చెల్లించాలి.

భక్తులు ఈ ప్యాకేజీ ద్వారా సౌకర్యవంతంగా, ఒకే యాత్రలో తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాలను దర్శించవచ్చు.

బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి IRCTC Tourism

Follow Us