AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆఫీసుకు రావాలని బాస్ బలవంతం.. పుట్టిన గంటకే పసికందు మృతి.. కట్‌చేస్తే కంపెనీకి వందల కోట్ల జరిమానా!

కార్పొరేట్ కంపెనీల కఠిన నిబంధనలు ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తుంటాయి. తాజాగా చోటుచేసుకున్న ఒక ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. గర్భిణీ అని కూడా చూడకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ నిరాకరించినందుకు ఒక కంపెనీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆమె గర్భం దాల్చిన సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల వైద్యులు ఆమెను ఇంటి నుండే పని చేయాలని (WFH) సూచించారు. అయితే, సదరు కంపెనీ ఆమె అభ్యర్థనను తిరస్కరించి, ఆఫీసుకు రావాలని లేదా జీతం లేని సెలవు (Unpaid Leave) తీసుకోవాలని బలవంతం చేసింది.

ఆఫీసుకు రావాలని బాస్ బలవంతం.. పుట్టిన గంటకే పసికందు మృతి.. కట్‌చేస్తే కంపెనీకి వందల కోట్ల జరిమానా!
Pregnant Employee Wfh Case
Jyothi Gadda
|

Updated on: Mar 22, 2026 | 5:44 PM

Share

కార్పొరేట్ కంపెనీల కఠిన నిబంధనలు ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తుంటాయి. తాజాగా చోటుచేసుకున్న ఒక ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. గర్భిణీ అని కూడా చూడకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ నిరాకరించినందుకు ఒక కంపెనీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గర్భిణీ స్త్రీకి వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) నిరాకరించినందుకు సదరు కంపెనీకి కోర్టు భారీ జరిమానా విధించింది. అమెరికాలోని ఓహియోలో జరిగిన ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…

ఉద్యోగ ప్రదేశాల్లో గర్భిణీలకు ఉండాల్సిన కనీస సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి పరిణామాలు ఉంటాయో ఈ ఘటన నిరూపిస్తోంది. గర్భిణీ స్త్రీకి వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) నిరాకరించినందుకు ఒక ప్రైవేటు కంపెనీకి కోర్టు భారీ జరిమానా విధించింది. అమెరికాలోని ఓహియోఅమెరికాకు చెందిన చెల్సియా వాల్ష్ అనే మహిళ ఒక లాజిస్టిక్స్ కంపెనీలో పని చేసేవారు. ఆమె గర్భం దాల్చిన సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల వైద్యులు ఆమెను ఇంటి నుండే పని చేయాలని (WFH) సూచించారు. దీంతో ఆమెకి రిక్వెస్ట్‌ పెట్టింది. తనకు కొన్ని శస్త్రచికిత్సల కారణంగా బెడ్ రెస్ట్ అవసరమని, ఇంటి నుండే పని చేసుకునే అవకాశం ఇవ్వాలని తన మేనేజర్‌ను కోరింది. వైద్యుల సర్టిఫికెట్ చూపించినప్పటికీ, కంపెనీ యాజమాన్యం ఆమె అభ్యర్థనను పట్టించుకోలేదు. ఆఫీసుకు వచ్చి పని చేయాలని, లేదంటే ఉద్యోగానికి సెలవు పెట్టాలని ఒత్తిడి తెచ్చింది.

ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆమె ఆఫీసుకు వెళ్లక తప్పలేదు. అయితే, పని ఒత్తిడి, ప్రయాణాల వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతిని, కేవలం 5వ నెలలోనే పాపకు జన్మనిచ్చారు. పుట్టిన సమయంలో ఆ చిన్నారి ప్రాణంతోనే ఉన్నప్పటికీ, కేవలం గంటన్నర వ్యవధిలోనే మరణించింది. అదే రోజున ఆమె బాస్ ఫోన్ చేసి ఇకపై ఇంటి నుండి పని చేసుకోవచ్చు అని చెప్పడం గమనార్హం. కానీ, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది.

ఇవి కూడా చదవండి

తన బిడ్డ మరణానికి కంపెనీయే కారణమని చెల్సియా కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం, జ్యూరీ ఈ ఘటనలో కంపెనీదే తప్పు అని తేల్చింది. ఒక ఉద్యోగికి మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తగిన వసతులు కల్పించకపోవడం నేరమని పేర్కొంటూ, కంపెనీకి రూ.187 కోట్ల ($22.5 Million) జరిమానా విధించింది. ఈ తీర్పు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు ఒక హెచ్చరిక లాంటిది. ఉద్యోగుల ఆరోగ్యం, ముఖ్యంగా గర్భిణీ స్త్రీల అవసరాల పట్ల మానవత్వంతో వ్యవహరించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన తెలియజేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us