AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheetah vs Lion: చిరుతపులి, సింహం తలపడితే ఎలా ఉంటుందో తెలుసా..?ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక ఆడ చిరుత తన పిల్లలను కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి సింహంతో పోరాడిన దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రకృతిలో తల్లి ప్రేమకు ఉన్న శక్తిని ఈ వీడియో ప్రతిబింబిస్తోంది. సాధారణంగా సింహాలను చూస్తే చిరుతలు పారిపోతాయి, కానీ ఇక్కడ తన పిల్లల ప్రాణాలు ప్రమాదంలో ఉండటంతో ఆ తల్లి చిరుత వెనక్కి తగ్గలేదు. తన కంటే రెట్టింపు బలం ఉన్న సింహంతో ముఖాముఖి తలపడింది. సింహాన్ని గోళ్లతో గీరుతూ, కరుస్తూ తీవ్రంగా ప్రతిఘటించింది. చివరకు..

Cheetah vs Lion: చిరుతపులి, సింహం తలపడితే ఎలా ఉంటుందో తెలుసా..?ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్!
Cheetah Vs Lion
Jyothi Gadda
|

Updated on: Mar 22, 2026 | 3:17 PM

Share

జంతు సామ్రాజ్యంలో సింహానికి ఎదురువెళ్లడం అంటే ఆత్మహత్యతో సమానం. ముఖ్యంగా చిరుతపులులు సింహాల దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా ఇష్టపడవు. కానీ, ఒక తల్లి మనసు తన బిడ్డల కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుందని నిరూపించింది ఈ వైరల్ వీడియో. ఈ అరుదైన దృశ్యం ఆఫ్రికాలోని సెరెంగెటి నేషనల్ పార్క్‌లో చోటుచేసుకుంది. ఒక ఆడ చిరుత తన రెండు చిన్న పిల్లలతో కలిసి పొదల చాటున సేదతీరుతోంది. అదే సమయంలో అటుగా వచ్చిన ఒక ఆడ సింహం, ఈ చిరుత పిల్లలను వేటాడాలని ప్లాన్ చేసింది. సింహం మెల్లగా అడుగులు వేస్తూ దగ్గరకు రావడం గమనించిన తల్లి చిరుత వెంటనే అప్రమత్తమైంది.

సాధారణంగా ఇలాంటి సమయంలో చిరుతలు పిల్లలను వదిలేసి పారిపోతాయని చాలా మంది అనుకుంటారు. కానీ, ఇక్కడ ఆ తల్లి చిరుత సింహానికి ఎదురుగా నిలబడి గర్జించింది. సింహం ఒక్కసారిగా దాడి చేయగా, చిరుత కూడా అంతే వేగంగా తన పంజాలతో సింహం ముఖంపై దాడి చేసింది. సింహం కాళ్లను కరుస్తూ దానిని కదలకుండా ఇబ్బంది పెట్టింది.

చిరుత చేసిన ఈ మెరుపు దాడికి సింహం కొంత కంగారు పడింది. ఈ కొద్దిపాటి సమయాన్ని ఉపయోగించుకున్న చిరుత పిల్లలు సురక్షితంగా పొదల్లోకి పారిపోయి దాక్కున్నాయి. తన పిల్లలు క్షేమంగా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాత, ఆ చిరుత అత్యంత చాకచక్యంగా సింహం పట్టు నుండి తప్పించుకుని దగ్గరలోని ఎత్తైన చెట్టుపైకి ఎక్కి కూర్చుంది.

ఇవి కూడా చదవండి

సింహం ఎంత ప్రయత్నించినా చిరుతను పట్టుకోలేక చివరకు వెనుదిరిగింది. తల్లి ధైర్యం, సమయస్ఫూర్తి వల్ల ఆ రెండు పిల్లల ప్రాణాలు దక్కాయి. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా షేర్ అవుతోంది. ప్రకృతిలో బలం కంటే ధైర్యమే గొప్పదని ఈ ఘటన నిరూపించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us