సాధారణంగా కలలు అనేవి అందరికీ వస్తూంటాయి. అయితే అవి ఒక్కోసారి గుర్తుంటాయి. మరొకసారి అసలేమీ గుర్తుండవు. అలాగే కలలో పీడ కలలు, మంచి కలలు కూడా వస్తాయి. వీటికి చాలా మంది భయ పడి పోతూ ఉంటారు. ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన పడి పోతూ ఉంటారు. అయితే నిద్రలో వచ్చే కొన్ని కలలు.. భవిష్యత్తుకు ముడి పడి ఉంటాయని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలా సారకూ ఈ కలల్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. తికమక పడుతూ ఉంటారు.
అందుకే కొందరి మనుషుల్ని కానీ, ప్రదేశాల్ని కానీ చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. స్వప్న శాస్త్రం ప్రకారం.. ఒక్కో కలకు ఒక్కో అర్థం ఉంటుంది. అయితే ఒత్తిడికి గురవడం వల్ల కూడా కొందరికి కలలు వస్తూంటాయని మరికొందరు చెబుతూంటారు. ఈ విషయం పక్కన పెడితే.. కలలో కొన్ని సార్లు చిన్న పిల్లలు.. ఏడుస్తూ లేదా నవ్వుతూ కనిపిస్తారు. స్వప్న శాస్త్రం ప్రకారం.. పిల్లలు కలలో కనిపించిన వాటికి కూడా అర్థాలు ఉన్నాయట. మరి వాటికి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి భవిష్యత్తులో మీకు హెల్ప్ అవుతాయి.
చిన్న పిల్లలు కలలో కనిపిస్తే అర్థం ఇదే:
సాధారణంగా చిన్న పిల్లలు కలలో కనిపిస్తే.. త్వరలోనే జీవితంలో కొన్ని శుభ వార్తలు వస్తాయని అర్థం చేసుకోవాలి. ఇంటికి ఆనందం, శ్రేయస్సును కూడా తెస్తున్నట్లు అనుకోవాలి. అదే కలలో కొంచెం పెద్ద పిల్లలు కనిపిస్తే.. జీవితంలో సానుకూల మార్పు ఉండబోతుందని అర్థం చేసుకోవాలి.
పిల్లలు ఏడుస్తూ కలలో కనిపిస్తే.. జరిగేది ఇదే:
అదే చిన్న పిల్లలు కలలో ఏడుస్తున్నట్లు వస్తే.. మీ కోరికల్లో ఒకటి త్వరలోనే నెరబోతుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదే చిన్న పిల్లలు నవ్వుతూ కనిపిస్తే మాత్రం.. మధ్యలో ఆగిపోయిన ముఖ్యమైన పనులు మళ్లీ తిరిగి ప్రారంభిస్తారని అర్థం చేసుకోవాలి. అంతే కాకుండా ఆర్థికంగా కూడా మీరు ప్రయోజనం పొందవచ్చు.
మీ కలలో కవల పిల్లలు కనిపిస్తే.. ప్రమోషన్ వస్తుందట:
అలాగే కలలో కవల పిల్లలు కనిపిస్తే.. మీ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని, అదే విధంగా సంతానం కలగబోతుందని కూడా అర్థం చేసుకోవచ్చు. మీ డ్రీమ్ లో నవ జాత శిశువు ఒడిలో నిద్రిస్తున్నట్లు కనిపిస్తే.. మీ దగ్గరి కుటుంబ సభ్యుల్లో ఒకరికి బిడ్డ పుడుతుందని స్వప్న శాస్త్రం చెబుతోంది.