Spirituality Tips: మీరు చనిపోయినట్టు కల వచ్చిందా.. దాని అర్థం ఏంటో తెలుసా!

నిద్రలో కలలు రావడం అనేది సర్వ సాధారణమైన విషయం. కానీ ప్రతి కలకి అర్థం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతుంది. కలలు అనేవి భవిష్యత్తులో మనకు జరగబోయే సంఘటనలను సూచిస్తుందని నిపుణులు అంటూంటారు. అయితే చాలా వరకు కొన్ని రకాల కలలు మనకు గుర్తుండవు.. కానీ మరి కొన్ని మాత్రం గుర్తుకు ఉంటాయి. కొన్ని ప్రశాంతమైన కలలు వస్తే.. మరికొన్ని పీడ కలలు వస్తూంటాయి. ఉదయం లేచాక ఆ కలల గురించి చాలా మంది కంగారు పడుతూంటారు. కలల్ని అర్థం చేసుకోవడం కష్టం. కలలో వచ్చే పలు విషయాలు..

Spirituality Tips: మీరు చనిపోయినట్టు కల వచ్చిందా.. దాని అర్థం ఏంటో తెలుసా!
Spirituality Tips

Edited By: Ram Naramaneni

Updated on: Dec 04, 2023 | 8:20 PM

నిద్రలో కలలు రావడం అనేది సర్వ సాధారణమైన విషయం. కానీ ప్రతి కలకి అర్థం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతుంది. కలలు అనేవి భవిష్యత్తులో మనకు జరగబోయే సంఘటనలను సూచిస్తుందని నిపుణులు అంటూంటారు. అయితే చాలా వరకు కొన్ని రకాల కలలు మనకు గుర్తుండవు.. కానీ మరి కొన్ని మాత్రం గుర్తుకు ఉంటాయి. కొన్ని ప్రశాంతమైన కలలు వస్తే.. మరికొన్ని పీడ కలలు వస్తూంటాయి. ఉదయం లేచాక ఆ కలల గురించి చాలా మంది కంగారు పడుతూంటారు. కలల్ని అర్థం చేసుకోవడం కష్టం. కలలో వచ్చే పలు విషయాలు.. భవిష్యత్తును సూచిస్తాయని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు. ఇలాగే చాలా మందికి కలలో వేరే వ్యక్తులు, తాను చనిపోయినట్టు కలలు కూడా వస్తాయి. మరి ఇలా కలలో చనిపోయినట్టు కలలు రావడం వెనుక అర్థం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.

కలలో తాను చనిపోయినట్టు కల వస్తే..

కలలో తాను చనిపోయినట్టు కానీ.. వేరే ఎవరైనా చనిపోయినట్టు కలలు వస్తే.. అది శుభం సంకేతమేనట. ఈ కల వస్తే త్వరలోనే మీ పాత కోరికలు ఏమైనా ఉంటే నెరవేరుతాయని స్వప్న శాస్త్రం చెబుతుంది. ఈ కల వస్తే రాబోయే రోజుల్లో అపారమైన విజయాన్ని సాధిస్తారని అర్థమట. ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు కల వస్తే మంచిదే కానీ.. అది ఏ సమయంలో వచ్చింది అనే దానిపై ఆధార పడి ఉంటుంది. బ్రహ్మ ముహూర్త సమయంలో మీకు ఇష్టమైన వ్యక్తి చనిపోయినట్టు కల వస్తే మాత్రం.. అది ఖచ్చితంగా అశుభమే. అలాగే ఈ కల అర్థరాత్రి వస్తే మాత్రం.. ఆ వ్యక్తి దీర్ఘాయువుతో ఉంటారని అర్థం చేసుకోవచ్చు.

చని పోయిన వ్యక్తులు కలలోకి వస్తే..

అదే విధంగా స్వప్న శాస్త్రం ప్రకారం.. చనిపోయిన బంధువులు కానీ వ్యక్తులు కానీ కలలో వస్తే అది అశుభంగా భావించారు. చనిపోయిన వ్యక్తులు కలలోకి వస్తే.. వారు మనకు ఏదో సూచిస్తున్నారని అర్థం చేసుకోవాలి. కష్టాల్లో ఉన్నప్పుడే చనిపోయిన బంధువులు కలలోకి వస్తారు. వారు కలలో కనిపించి.. మీకు రాబోయే సమస్యల గురించి హెచ్చరిస్తారట. రాబోయే రోజుల్లో కుటుంబంలో మరిన్ని సమస్యలు వస్తాయని హెచ్చరించడానికి వారు కలలో కనిపిస్తారని స్వప్న శాస్త్రం చెబుతుంది. ఇలా వివిధ రకాల కలలకు పలు రకాల అర్థాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.