ధన్‌తేరస్ రోజున షాపింగ్ చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ మీరు ధన్‌తేరస్ రోజున ఎప్పుడైనా షాపింగ్ చేయవచ్చు. ఎందుకంటే ఈ రోజు మొత్తం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ రోజు కొనడం మంచిదని విశ్వాసం. మీరు కొత్త కారును కొనుగోలు చేసే ఆలోచన చేస్తుంటే.. కారు కొనుగోలు చేసే శుభ సమయం గురించి ఈ రోజు తెలుసుకుందాం..
ధన్‌తేరస్ రోజున ప్రజలు బంగారం, వెండి, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, కొత్త కార్లు, స్కూటర్లు మొదలైనవి కొనుగోలు చేస్తారు. ధన్‌తేరస్ పండుగ దీపావళికి 2 రోజుల ముందు ఆశ్వయుజ మాసం త్రయోదశి నాడు వస్తుంది. కొత్త కారు కొనాలనేది ప్రతి ఒక్కరి కల. వాహనం ఇంటికి రెండవ ఆస్తి. అటువంటి పరిస్థితిలో ప్రజలు దీపావళి, ధన్‌తేరస్ వంటి శుభ సందర్భాల్లో కార్లను కొనుగోలు చేస్తారు.
ఈ సంవత్సరం ధన్‌తేరస్ 10 నవంబర్ 2023 న జరుపుకుంటారు. ఈ రోజున షాపింగ్ చేయడం వల్ల సంపదలు చేకూరుతాయని మత విశ్వాసం. అలాగే కుబేరుడు, తల్లి లక్ష్మిదేవి ఆశీస్సుల కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. ధన్‌తేరాస్ రోజున చాలా మంది కారు కొనాలని ప్లాన్ చేస్తారు. అటువంటి పరిస్థితిలో, వాహనాన్ని ఏ శుభ ముహూర్తంలో కొనుగోలు చేయాలో తెలుసుకోవడం ముఖ్యం. అలాగే ఈ రోజున కొత్త వాహనం కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
ధన్‌తేరస్ రోజున చర లగ్నములో వాహనం కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. చాలా మంది ప్రజలు ఈ శుభ సమయంలో కారు కొంటారు. ఎందుకంటే ఈ లగ్నం చాలా శుభప్రదం. ఈ ధన్‌తేరస్‌లో ఎవరైనా కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటే పగలు చర లగ్నంలో మధ్యాహ్నం 2:57 నుండి సాయంత్రం 4:35 గంటల వరకు వాహనాన్ని కొనుగోలు చేయవచ్చని జ్యోతిష్యులు చెప్పారు. ఉదయం 10 గంటల నుండి 11:58 గంటల వరకు వాహనం కూడా కొనుగోలు చేయవచ్చు. వాహనం కొనడానికి ఈ రెండు సమయాలు అనుకూలం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు