వసంత పంచమి సందర్భంగా ప్రతి సంవత్సరం మహారాష్ట్రలోని పండరి పురంలోని పాండురంగ, రుక్మిణీ దేవిల వివాహం సంప్రదాయ పద్దతిలో అంగరంగ వైభంగా నిర్వహించారు. ఈ వివాహం జరిగే సమయంలో ఒక భక్తుడు విఠలుడికు సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను సమర్పించారు. పండరి పురం ఆలయ కమిటీ చరిత్రలో ఇది అతిపెద్ద విరాళంగా తెలుస్తోంది. అయితే భక్తుడు తన పేరు బయటకు వెల్లడించవద్దని షరత్తు విధించినట్లు తెలుస్తోంది.
1.25 కోట్ల విలువ జేసే .. ఆభరణాలు పాండురంగ, రుక్మిణీ దేవిల కల్యాణానికి కానుకగా ఇచ్చారు ఓ అజ్ఞాత భక్తురాలు. బంగారు కిరీటాలు, హారాలు, కంకణాలు, మంగళసూత్రం వంటి బంగారు ఆభరణాలు ఉన్నాయి. అంతేకాదు వెండి పళ్లెం, వెండి చెంబు, వెండి పాత్ర, రాగి పాత్ర, దీపస్తంభం, వెండి అద్దం వంటి వాటివి కూడా విరాళంగా ఇచ్చారు. మహారాష్ట్రలోని జల్నాకు చెందిన ఓ మహిళా భక్తురాలు ఈ భారీ విరాళాన్ని విఠలుడికి ఇచ్చినట్లు.. తన పేరును గోప్యంగా ఉంచాలనే షరతు విధించినట్లు సమాచారం.
మరోవైపు విఠలుడి ఆలయంలో పాండురంగ రుక్మిణి తల్లి కల్యాణం జరిగింది. బెంగుళూరుకు చెందిన ఒక భక్తుడు ఈ వివాహ వేడుక కోసం అన్ని బట్టలు, ఇతర ఉపకరణాలను సమర్పించాడు. ఇతను కూడా ఆలయ కమిటీకి తన పేరు వెల్లడించవద్దు అని షరతు విధించాడు.
గత యాభై ఏళ్ల చరిత్రలో ఇదే అతిపెద్ద విరాళం..
ఆలయ కమిటీ ఈ విరాళం గురించి మాట్లాడుతూ.. గత యాభై ఏళ్లలో పాండురంగడుకి వచ్చిన అతిపెద్ద విరాళం ఇదేఅని చెప్పారు. వసంత పంచమి,గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆలయాన్ని అత్యంత సుందరంగా పూలతో ఆకర్షణీయంగా అలంకరించారు. స్వామివారి వివాహం కోసం చెన్నై, బెంగళూరు నుండి ప్రత్యేక పట్టు వస్త్రాలు ఆర్డర్ చేయబడ్డాయి. విఠల్ స్వామి, రుక్మిణి అమ్మవారి కల్యాణోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..