Dasara: దేశ వ్యాప్తంగా దసరా పండగ శోభ.. భక్త కీలద్రిగా మారిన ఇంద్రకీలాద్రి..

దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పండగ శోభ కనిపిస్తోంది. దసరా సండదితో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. దేశమంతటా శరన్నవరాత్రుల వైభవం.. అంతటా పండుగ సంబరం..

Dasara: దేశ వ్యాప్తంగా దసరా పండగ శోభ.. భక్త కీలద్రిగా మారిన ఇంద్రకీలాద్రి..
Dasara

Edited By: Anil kumar poka

Updated on: Oct 15, 2021 | 10:53 AM

దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పండగ శోభ కనిపిస్తోంది. దసరా సండదితో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. దేశమంతటా శరన్నవరాత్రుల వైభవం.. అంతటా పండుగ సంబరం.. జగన్మాతను వివిధ అలంకరణల్లో.. వివిధ రూపాలలో ఆరాధించుకునే సమయం.. ఆలయాలన్నీ కళకళలాడుతున్న సందర్భం ఇది. తొమ్మిది రోజులూ మనకు పర్వదినాలే అయినా దుర్గాష్టమి.. మహర్నవమి… విజయదశమిలకే ప్రాధాన్యమిస్తాం.. ఈ మూడు రోజులు ఎంతో ఉత్సాహంగా ఉత్సవాలు జరుపుకుంటాం… వేడుకలు చేసుకుంటాం.

దసరా సందర్భంగా.. దుర్గామాత ఆలయాలే కాదు.. అన్ని దేవాలయాల్లో భక్తులు పోటెత్తారు. మంగళ స్నానాలు ఆచరించి.. తెల్లావారు జాము నుంచే ఆలయాలకు క్యూ కట్టారు. పండగ పూట ఆ దేవిని దర్శించుకుంటే.. విజయం సిద్ధిస్తుందనేది భక్తుల నమ్మకం.

ఇంద్రకీలాద్రి.. భక్త కీలద్రిగా మారింది. వేలాది మంది భక్తులు అమ్మావారిని దర్శించుకుంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. పూజలు నిర్వహిస్తున్నారు. పోలీసుల భద్రతా చర్యల మధ్య ఉత్సవాలు జరుగుతున్నాయి.

తిరుమలలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అయ్యాయి. ఆఖరి ఘట్టమైన చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా ఏకాంతంగా జరిపారు. చక్రస్నానం మహోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NVరమణ హాజరయ్యారు. ఆయనతో పాటు.. పలువురు సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: RK: పోలీసులు చెబుతుంటే తెలిసింది తప్ప.. పార్టీ నుంచి సమాచారం రాలేదు.. కుటుంబ సభ్యుల కామెంట్..

Dasara – Jimmy: దసరా రోజున జమ్మి చెట్టును ఇలా పూజిస్తే.. కుబేరుడు మీ ఇంట్లో..