Tulsi Tree: ఇంట్లో తులసి చెట్టును రోజూ ఇలా పూజించడం వలన కలిగే ప్రయోజనాలెంటో తెలుసా.. ఎందుకు ఆరాధించాలంటే…
హిందూ సంప్రదాయంలో తులసి చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తులసి చెట్టును దేవతగా భావిస్తుంటాం. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు పూజిస్తుంటారు.
హిందూ సంప్రదాయంలో తులసి చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తులసి చెట్టును దేవతగా భావిస్తుంటాం. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు పూజిస్తుంటారు. తులసి చెట్టును విష్ణువు ఆరాధించే సమయంలో ఉపయోగిస్తుంటారు. ఇంట్లో తులసి చెట్టు ఉంటే.. ఆ ఇళ్లు సుఖసంతోషాలతో.. ఆర్థికంగా మెరుగుపడుతుందని అంటుంటారు. అంతేకాకుండా… తులసిని ఔషద మొక్కగా కూడా ఉపయోగిస్తుంటారు. తులసి ఆకులతో ఎననో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే తులసి చెట్టును రోజూ పూజించడం వలన ఇంటి సమస్యలు, వివాహా సమస్యలు, వ్యాపారంలో నష్టం సమస్యలను తొలగిపోతాయని అంటుంటారు.
* మన హిందూ సంప్రదాయ ప్రకారం… 4 నుంచి 5 తులసి ఆకులను ఇత్తడి కుండలో వేసి సుమారు 24 గంటలు ఉండనివ్వాలి. మరుసటి రోజు ఇంటి ముంగిట ఆ తులసి నీటిని చల్లుకోవాలి. అంతేకాకుండా.. ఇంట్లోని కొన్ని చోట్ల ఈ నీటిని చల్లడం ద్వారా ఇంటి సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం..
* ఇంట్లో ఉన్న అమ్మాయిలకు, అబ్బాయిలకు పెళ్లి సమస్యలు వెంటాడుతుంటే… రోజూ తులసి చెట్టును పూజించడం వలన మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. * వ్యాపారంలో నష్టం రాకుండా ఉండాలంటే.. రోజూ తులసి చెట్టును ఆరాధించడం మంచిది. వ్యాపారం తీవ్ర నష్టం వచ్చినవారు ప్రతి శుక్రవారం.. తులసి చెట్టును పచ్చిపాలు, స్వీట్స్ తో ఆరాధించండి. మిగిలిన ప్రసాదాన్ని వివాహిత స్త్రీకి దానం చేయడం వ్యాపారంలోని నష్టాలు తగ్గుతాయి. * మీ ఇంట్లో వాస్తు సమస్యలు ఎదుర్కోంటునట్లయితే తులసి చెట్టు ఆరాధించడం మంచిది. ఇంటి ఆగ్నేయ దిశలో తులసి మొక్కను నాటాలి. అలాగే… ప్రతిరోజూ.. నెయ్యితో దీపం వెలిగించాలి.
India in Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌కు భారత బాక్సర్లు సిద్ధం; పతకాల వేటలో గెలిచేది ఎందరో..?
Ranveer Singh: రణ్వీర్ సింగ్ న్యూలుక్ ఫోటోషూట్ వైరల్… మీమ్స్‌తో ఆటడేసుకుంటున్న నెటిజన్లు..