అనంతపురం జిల్లాలోని ఓ ప్రముఖ శైవక్షేత్రంలో నాగుపాము హల్‌చల్ చేసింది. అర్థరాత్రి 12గంటల సమయంలో అది ఒక ఊరి చివరన ఉన్న శివాలయం కనిపించింది. ఒక వివాహ వేడుకకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చివర్లో ఆలయం తలపులు మూద్దామని చూస్తే శివలింగం వెనుక భారీ నాగుపాము.. బుసలు కొడుతూ.. పడగ విప్పింది. ఇది చూసిన పెళ్లి బృందం షాక్ అయ్యింది. అసలు అర్ధరాత్రి శివలంగం చెంతన పాము.. అందునా నాగుపాము చూసి జనం ఒకింత భయపోయారు. వివరాల్లో వెళ్లితే.. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం భైరసముద్రంలో రుద్రలింగేశ్వర ఆలయంలో జరిగింది. ఆదివారం రాత్రి పూజా కార్యక్రమాలకు వెళ్లిన కొంతమంది భక్తులకు శివలింగం పక్కనే నాగుపాము కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు, గంటకుపైగా గర్భగుడిలోని నాగుపాము ఒకే చోట ఉంది. పడగ విప్పి బుసలు కొట్టింది.
అప్పుడు భక్తులంతా ఓం నమఃశివాయ అంటూ పూజలు చేశారు. ఇది సాక్షాత్తూ శివుని మహిమ అని భావించారు. అయితే ఆలయంలో పాము ఉంటే కష్టం అని భావించి.. కొంతసేపటి తర్వాత గ్రామంలోని పలువురు యువకులు నాగుపామును బయటికి పంపించారు. అర్ధరాత్రి ఇలా శివలింగం చెంతన పాము ఉన్న సంఘటనపై జనమంతా చర్చించుకున్నారు.
ఇవి కూడా చదవండి: Budget 2022: ఆత్మ నిర్భర్ భారత్‌లో మహిళల పాత్ర కీలకం.. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ ఆలయ ప్రస్తావన