Tirumala: తిరుమలకు చేరుకున్న సీజేఐ ఎన్వీ రమణ.. ఘన స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు. ఇప్పటికే తిరుమలకు చేరుకున్న ఆయన.. గురువారం వేకువజామున శ్రీవారిని ఆయన దర్శించుకోనున్నారు.
తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు. ఇప్పటికే తిరుమలకు చేరుకున్న ఆయన.. గురువారం వేకువజామున శ్రీవారిని ఆయన దర్శించుకోనున్నారు. బుధవారం రాత్రికి పద్మావతి గెస్ట్ హౌస్‌లో బస చేయనున్నారు. తిరుమలకు చేరుకున్న సీజేఐ రమణకు టీటీడీ ఛైర్మన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి స్వాగతం పలికారు. పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్న భారత ప్రధాన న్యాయమూర్తికి వైవీ సుబ్బారెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు పలువురు న్యాయమూర్తులు కూడా భారత ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం సీజేఐ ఎన్వీ రమణ తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో ఇప్పటికే శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 13, 14 తేదీల్లో ప్రత్యేకంగా దర్శన ఏర్పాట్లు నిర్వహించినట్లు టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. అనంతరం సీజేఐను అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి ప్రసాదాలు అందజేయనున్నారు.
ఇవి కూడా చదవండి: Viral Video: పాముతో గేమ్సా.. క్షణాల్లో కాటేసింది.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!