Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈ నెలలో రెండు రోజులు శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకంటే..

తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా ఉంటుంది. పండగలు, విశేషమైన రోజుల్లో మాత్రమే కాదు.. రోజూ వెంకన్న భక్తులతో ఏడు కొండలు నిండిపోతాయి. శ్రీవారి దర్శనం కోసం వెళ్ళే భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ నెలలో చంద్ర గ్రహణం ఏర్పడనున్నందున సాంప్రదాయ ప్రకారం మూసివేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఈ నెలలో రెండు రోజులు శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకంటే..
Tirupati Temple Closes For Lunar Eclipse

Updated on: Sep 01, 2025 | 1:47 PM

ఈ నెలలో రెండవ చివరి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించనున్న సంగతి తెలిసిందే. దీంతో గ్రహణ సూతక కాలం ఉంటుంది. ఈ నేపధ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం ఒక కీలక ప్రకటన చేసింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సెప్టెంబర్ 7, 2025న చంద్రగ్రహణం కారణంగా మూసివేయబడుతుందని TTD ప్రకటించింది. ఆలయ పరిపాలన ప్రకారం సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 3:30 గంటలకు శ్రీవారి ఆలయం ముసివేయనున్నారు. చంద్ర గ్రహణం వీడి ఆలయాన్ని సంప్రదాయం ప్రకారం శుద్ధి కర్మలను చేసిన తర్వాత సెప్టెంబర్ 8, 2025న తెల్లవారుజామున 3:00 గంటలకు తిరిగి తెరవనున్నట్లు ప్రకటించారు.

సాంప్రదాయ ఆచారాల ప్రకారం మూసివేత

హిందూ సంప్రదాయాల ప్రకారం సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు మూసివేస్తారు. ఎందుకంటే గ్రహణ సమయం పూజలు నిర్వహించడానికి అశుభకరమైనదిగా భావిస్తారు. భారతదేశంలోని పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రంలో ఒకటైన తిరుమల తిరుపతి ఆలయం ఈ ఆచారాన్ని ఖచ్చితంగా పాటిస్తుంది. ఈ కాలంలో ఆలయంలో శ్రీవారి దర్శనం, అన్ని రకాల సేవలు నిలిపివేయబడతాయి. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత… ఆలయ పూజారులు పుణ్యహవచనం (శుభ్రపరిచే ఆచారాలు), ఇతర వేద ఆచారాలను నిర్వహించి భక్తుల కోసం ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. గ్రహణం తర్వాత శుద్ధి కర్మలు పూర్తయిన వెంటనే ఆలయంలో అన్ని సాధారణ సేవలు, దర్శనాలు తిరిగి ప్రారంభమవుతాయి.

శ్రీవారి భక్తులపై ప్రభావం

తిరుమల ఆలయం ముసి వేయనున్న నేపధ్యంలో ఈ సమయంలో శ్రీవారి దర్శనం కోసం ఏర్పాటు చేసుకున్న వేలాది మంది భక్తులపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. సవరించిన సమయాలకు అనుగుణంగా యాత్రికులు తమ దర్శనాలను తిరిగి షెడ్యూల్ చేసుకోవాలని, అందుకోసం TTD అధికారిక వెబ్ ని సందర్శించి ఆలయ దర్శన సమయం గురించి సమాచారం తెలుసుకోవాలని TTD అధికారులు కోరారు. సెప్టెంబర్ 8 తెల్లవారుజామున భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న టీటీడీ సిబ్బంది అందుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతుందని ఆలయ అధికారులు చెప్పారు,

ఇవి కూడా చదవండి

తిరుమల ఆలయం.. ప్రాముఖ్యత

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఉంది. ప్రతి నెలా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. గ్రహణ సమయంలో తాత్కాలికంగా ఆలయం మూసివేయడం వలన అసౌకర్యం కలిగినప్పటికీ ఆలయ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడటానికి ఈ చర్యలు చాలా కీలకమని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ 7 వ తేదీ 2025 చంద్రగ్రహణం భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా అనేక ఇతర దేవాలయాలు కూడా గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)