Chandra Grahan 2023: జాతకంలో చంద్ర దోషమా..! గ్రహణ సమయంలో ఈ మంత్రాలు పఠించడం శుభప్రదం..

|

May 04, 2023 | 9:48 AM

రాహువు, కేతువు గ్రహాలు దుష్ట గ్రహాలుగా భావిస్తారు. దీంతో కొన్ని రాశులపై తీవ్ర దుష్ప్రభావాలు చుపిస్తాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అంతేకాదు గ్రహణ సమయంలో కొన్ని పనులను చేయడం హానికరమని.. అంతేకాదు గ్రహణ సమయంలో కొన్ని నియమాలను పాటించాలని సూచించారు. ఈరోజు జ్యోతిష్క్యులు సూచించిన నియమాలు ఏమిటో తెల్సుకుందాం

Chandra Grahan 2023: జాతకంలో చంద్ర దోషమా..! గ్రహణ సమయంలో ఈ మంత్రాలు పఠించడం శుభప్రదం..
Chandra Grahan
Follow us on

రేపే వైశాఖ మాసం పౌర్ణమి. ఈ పున్నమిని బుద్ధ పూర్ణిమగా కూడా జరుపుకుంటారు. రేపే పౌర్ణమి.. భారతదేశం లో రాత్రి 8:44 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమయ్యి.. రాత్రి 10:52 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం మన దేశంలో కనిపించకపోయినా రాశులపై ప్రభావం చూపించనుంది. దీంతో మనుషులపై మంచి చెడుల ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

చంద్ర గ్రహణం ప్రత్యేకత ఏమిటంటే? 

చంద్రగ్రహణం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. రాహు, కేతువు చంద్రుడిని మింగినప్పుడు చంద్ర గ్రహణం.. అమావాస్య రోజున సూర్యుడిని మిగినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుందని హిందువులు నమ్మకం. రాహువు, కేతువు గ్రహాలు దుష్ట గ్రహాలుగా భావిస్తారు. దీంతో కొన్ని రాశులపై తీవ్ర దుష్ప్రభావాలు చుపిస్తాయని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అంతేకాదు గ్రహణ సమయంలో కొన్ని పనులను చేయడం హానికరమని.. అంతేకాదు గ్రహణ సమయంలో కొన్ని నియమాలను పాటించాలని సూచించారు. ఈరోజు జ్యోతిష్క్యులు సూచించిన నియమాలు ఏమిటో తెల్సుకుందాం..

ఇవి కూడా చదవండి

చంద్రగ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు.. 

  1. గ్రహణం ఏర్పడే సమయంలో స్నానం మాచరించి మంత్రాలను జపించడం శుభ ప్రదం. గ్రహణం విడిచిన అనంతరం స్నానం ఆచరించడం శుభప్రదం.
  2. చంద్ర దోషం తొలగించుకోవడానికి గ్రహణ సమయంలో “ఓం శ్రీ శ్రీ చంద్రాంశే నమః” అనే మంత్రాన్ని పఠించడం వలన జాతకంలో చంద్ర దోషం తొలగుతుంది.
  3. చంద్రగ్రహణం సమయంలో గాయత్రీ మంత్రం, మహామృత్యుంజయ మంత్రం జపించాలి. అంతేకాదు మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా తలచుకోవాలి.
  4. చంద్రగ్రహణ సమయంలో ఆర్ధిక ఇబ్బందులు తగ్గించుకునేందుకు వైభవ లక్ష్మి మంత్రం “ఓం శ్రీ హ్రీ క్లీం శ్రీ సిద్ధ లక్ష్మ్యై నమః” అంటూ 108 సార్లు జపించింది. ఇలా చేయడం వలన లక్ష్మిదేవి అనుగ్రహం లభిస్తుంది.
  5. శత్రువుల నుంచి రక్షణ కోసం గ్రహణ సమయంలో  “ఓం హ్రీ బగలాముఖీ” అనే మంత్రాన్ని పఠించాలి.
  6. పనుల్లో ఏర్పడుతున్న ఆటంకాలు తొలగిపోవడానికి గ్రహణ సమయంలో శివయ్యను మనసులో తలచుకుంటూ “శివ చాలీసా” పఠించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).