
ఆచార్య చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి సాంగత్యం అతని వ్యక్తిత్వం గురించి చాలా చెబుతుంది. మంచి మనుషుల సహవాసం మిమ్మల్ని విజయపథంలో తీసుకెళ్తుంది. ఎల్లప్పుడూ మిమ్మల్ని సానుకూలంగా ఉంచుతుంది. అయితే జీవితంలో ఎల్లపుడూ సంతోషంగా ఉండాలంటే కొంతమందికి దూరంగా ఉంచాలని చెబుతున్నాడు చాణక్య..
ప్రతి వ్యక్తి తన జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటాడు. చాణక్యుడు తన విధానాల్లో మానవ విజయానికి కారకంగా మారిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఎవరితో స్నేహం చేస్తారో.. అతను మీ జీవితంలో చాలా ప్రభావం చూపిస్తాడు. మీ విజయం మరియు వైఫల్యం రెండూ మనుషుల సహవాసంతో ప్రభావితమవుతాయి. చాణక్యుడు కొంతమంది వ్యక్తులను ఎల్లప్పుడూ దూరం ఉంచాలని చెప్పాడు. ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం.
ప్రతి విషయాన్ని ప్రతి కూల దృక్పథంతో మాత్రమే చూస్తూ ఇతరులను ప్రోత్సహించే బదులు.. వారిని నష్టపరిచే విధంగా చర్యలు తీసుకునే స్త్రీకి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. అలాంటి మహిళలు మీ జీవితంలో ఇబ్బందులను సృష్టించవచ్చు. కనుక దుష్ట ఆలోచనలు ఉన్న స్త్రీల నుంచి ఎప్పుడూ దూరంగా ఉండాలి. అటువంటి వారికి సహాయం చేయడం మీకు హానికరం.
చాణక్యుడు ప్రకారం.. తన వైఫల్యానికి దేవుణ్ణి శపించేవాడు.. ఎప్పుడూ ఇతరులను విమర్శించే వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తులు మీలో కూడా ప్రతికూల ఆలోచనలు కలిగించేలా చేయవచ్చు. అటువంటి వారి స్నేహంతో ఎవరూ సంతోషంగా ఉండలేరు. అందువల్ల మీరు ఆనందంగా ఉండాలంటే.. అటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి.
చాణక్య నీతి ప్రకారం మూర్ఖులతో కలిసి జీవించకూడదు. మూర్ఖులకు ఏ విషయాన్నీ వివరించే ప్రయత్నం చేయరాదు. ఎందుకంటే ఇలా చేయడం మీ సమయాన్ని వృధా చేయడమే. మూర్ఖులను ఎంతగా ఒప్పించాలని ప్రయత్నించినా ఎవరి మాట వినడు. వారితో సమయం గడపడం మీకు హానికరం. వారితో మాట్లాడటం మీ శక్తిని వృధా చేసుకోవడమే.
ఎదుటివారి విజయాలను చూసి అసూయపడేవారు లేదా తమ లాభం కోసం ఎవరికైనా హాని కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండాలి. మీకు ఎంత ప్రత్యేకమైన వారైనా.. అవసరమైన సమయంలో.. వారు మిమ్మల్ని సులభంగా మోసం చేస్తారు. కనుక అసూయ పరులనుంచి ఏమీ ఆశించవద్దు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)