ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన విధానాలు యావత్ ప్రపంచానికే ఆదర్శనం. ఆయన సూచనలు ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో అనుసరించదగినవి. ఆయన చేసిన దిశానిర్దేశంతో విజయబావుటా ఎగురవేయడం ఖాయం. అంతటి ప్రశస్థి కలిగిన విధానాలు కబట్టే.. ఆచార్య చాణక్యుడి కీర్తి నేటికీ తగ్గలేదు. చాణక్యుడి రచించిన నీతిశాస్త్రం గ్రంధంలోని వ్యక్తి జీవితానికి సంబంధించి ఏం చేయాలి? ఏం చేయకూడదు? తప్పులేంటి? ఒప్పులేంటి? అనే సమగ్ర వివరాలను పొందుపరిచ్చారు. మనిషి చేసే చిన్ని తప్పిదాలతోనే.. విజయాన్ని సైతం అపజయంగా మార్చుకుంటాడని చాణక్యుడు పేర్కొన్నారు. అలాంటి తప్పిదాల్లో దురాశ ప్రధానమైనదని చాణక్యుడు పేర్కొన్నారు. దురాశ అనేది వ్యక్తిని మరణం వరకు విడిచిపెట్టని దుష్టశక్తి అని, ఈ దురాశా భావం నుంచి బయటపడం చాలా ముఖ్యం అని స్పష్టం చేశారు చాణక్య. ఈ దురాశ కారణంగా.. వ్యక్తి చేతి వరకు వచ్చిన విజయం కూడా చేజారిపోతుందని చెబుతున్నారు.
1. దురాశ కారణంగా వ్యక్తి శాశ్వతమైన వాటిని వదిలిపెట్టి, అశాశ్వతమైన వాటిని కోరుకుంటాడు.
2. వ్యక్తి తనకు సమీపంలో ఉన్నవాటిని విస్మరించి.. తనకు దూరంగా ఉన్నవాటిని పొందేందుకు పరుగెడుతాడు. దీని వల్ల వారు రెండు వస్తువులను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎటువంటి ప్రణాళిక లేకుండా పని చేస్తే ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
3. వ్యూహం పటిష్టంగా ఉంటేనే విజయం సిద్ధిస్తుంది. లేదంటే ఏ పని చేపట్టినా విజయం సాధించలేరు.
4. ఏదైనా పనిలో విజయం సాధించాలంటే.. ఆ ముందుగా ఆ పని ఏంటో నిర్ణయించుకోవాలి.
5. లక్ష్యం నిర్ణయించుకున్న తరువాత ఆ పనిని పూర్తి చేయాలి. అప్పుడే దాని ఫలితం విజయవంతంగా వస్తుంది.
6. దురాశను విడిచిపెడితే.. ప్రతిపనిలోనూ విజయం సాధిస్తారు.
7. మనకున్న వాటితోనే సంతృప్తి చెందడం తెలివైన పని అని స్పష్టం చేశారు ఆచార్య చాణక్యుడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..