Chanakya Niti: నేటి సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎవరికైనా బాధాకరంగానే ఉంటుందన్న చాణక్య
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు పండితుడు మాత్రమే కాదు గొప్ప దౌత్యవేత్త, రాజకీయవేత్త కూడా. సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని.. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు,..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు పండితుడు మాత్రమే కాదు గొప్ప దౌత్యవేత్త, రాజకీయవేత్త కూడా. సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని.. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషాలను వివరిస్తూ.. చాణుక్యుడు నీతి శాస్త్రం రచించారు. ఈ నీతి శాస్త్రంలో ప్రస్తుత కాలంలో ఉపయోగపడే అనేక విషయాలను గురించి చెప్పాడు. అలాంటి వాటిల్లో ఒకటి మనుషుల మధ్య ఉండే బంధాలు.. ఆ బంధాలను నిలబెట్టుకోవడానికి నడవడిక.. బంధం విడిపోతే మనిషి పడే తపన గురించి ఈరోజు చాణక్య నీతిగా తెలుసుకుందాం..
*భార్య లేదా స్నేహితురాలు నుండి విడిపోయే పరిస్థితి వస్తే ఆ వ్యక్తికి చాలా విచారంగా ఉంటుంది. ఈ పరిస్థితిని తట్టుకోవడం అందరికీ అంత సులభం కాదు. *ఒక వ్యక్తి .. బంధువు, స్నేహితుడు లేదా ఇతరులచే అవమానింపబడితే ఈ పరిస్థితి చాలా బాధను కలిగిస్తుంది. అలాంటి అవమానం ఆ వ్యక్తిని లోపల మంటలా దహించివేస్తుంది. * అధిక అప్పులను చేసి.. అతను దానిని తిరిగి చెల్లించలేనప్పుడు.. ఆ వ్యక్తిని ఆ ఇబ్బంది మనస్సుని కలవరానికి గురి చేస్తుంది. *మంచి వ్యక్తి..దయ లేని యజమానకి లేదా కపట వ్యక్తికీ సేవకుడు అయితే అతను ప్రతి క్షణం ఉక్కిరిబిక్కిరి అవుతాడు. *ఏ మనిషికైనా పేదరికం చాలా బాధాకరం. డబ్బు లేనప్పుడు, ఒక వ్యక్తి తన ఆనందాన్ని పూర్తిగా వదులుకోవాలి. ఈ పరిస్థితి ఎవరికైనా బాధాకరమే. *మంచి స్వభావం ఉన్న వ్యక్తి.. స్వార్థపరుడిని కలిస్తే, అతని పరిస్థితి చాలా విచారకరంగా మారుతుంది. అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆ వ్యక్తి తనను తాను.. చాలా సార్లు తిట్టుకుంటాడు.
Also Read: యూపీకి ప్రధాని మోడీ భారీ కానుక.. నేడు గంగా ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన.. 2024 నాటికి సిద్ధం