Chanakya Niti: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే చెడు సమయం రానుంది, అప్రమత్తంగా ఉండమని హెచ్చరిక అన్న చాణక్య

|

Jul 05, 2024 | 12:59 PM

చాణక్యుడు ప్రకారం జీవితం సంతోషముగా సాగాలంటే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన అనేక విషయాలు ఉన్నాయి. ఎవరైనా సరే ఈ విషయాలను పాటించకపోతే.. మంచి సమయాలు సైతం చెడుగా ఎప్పుడు మారతాయో కూడా మనిషి గ్రహించలేడు. చాణక్య నీతి ప్రకారం ఇంట్లో కనిపించే కొన్ని సంకేతాలు ఆ ఇంట్లో రాబోయే సమయం గురించి సూచిస్తున్నాయి. అప్పుడు జాగ్రత్తగా ఉండాలన చాణక్యుడు సూచిస్తున్నారు. 

Chanakya Niti: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే చెడు సమయం రానుంది, అప్రమత్తంగా ఉండమని హెచ్చరిక అన్న చాణక్య
Acharya Chanakya
Follow us on

జీవితంలో సుఖ సంతోషాలు ఉండాలంటే అనేక విషయాలను అనుసరించాల్సి ఉంటుంది. ఆచార్య చాణక్యుడు ప్రకారం జీవితం సంతోషముగా సాగాలంటే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన అనేక విషయాలు ఉన్నాయి. ఎవరైనా సరే ఈ విషయాలను పాటించకపోతే.. మంచి సమయాలు సైతం చెడుగా ఎప్పుడు మారతాయో కూడా మనిషి గ్రహించలేడు. చాణక్య నీతి ప్రకారం ఇంట్లో కనిపించే కొన్ని సంకేతాలు ఆ ఇంట్లో రాబోయే సమయం గురించి సూచిస్తున్నాయి. అప్పుడు జాగ్రత్తగా ఉండాలన చాణక్యుడు సూచిస్తున్నారు.

చాణక్య నీతి ప్రకారం చెడు సమయాలు రాకముందే ఈ సంకేతాలు

ఆర్థిక కొరత: ప్రత్యేక కారణం లేకుండా ఇంట్లో ఆర్థికంగా నష్టపోతే.. లేదా మీరు ఏదో ఒక సమస్య కోసం పదే పదే రుణం తీసుకోవాల్సి వస్తే.. ఇది మంచి సంకేతం కాదని అర్థం చేసుకోండి. అంతేకాకుండా ఆకస్మిక దొంగతనం లేదా విలువైన వస్తువులను పోగొట్టుకోవడం కూడా శుభపరిణామంగా పరిగణించబడదు.

ప్రతికూలత, అసమ్మతి: చాణక్య నీతి ప్రకారం తరచుగా తగాదాలు, ఇంట్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడితే ఆ వ్యక్తికి చెడు సమయానికి సూచన. భవిష్యత్తులో కొంత సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఎండిన తులసి మొక్క : చాణక్య నీతి ప్రకారం ఇంట్లో తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోవడం మొదలు పెడితే రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తుంది. డబ్బు సంబంధిత సమస్యలు భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలవని ఇది ముందస్తు సూచన.

పూజ చేయని ఇల్లు: చాణక్య నీతి ప్రకారం దేవుని నామాన్ని ఉచ్ఛరించని ఇంట్లో.. దేవుడిని పూజించని ఇంట్లో, ప్రతికూల శక్తి ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. దీని వల్ల జీవితంలో చేసిన పని చెడిపోవడం ప్రారంభమవుతుంది. ఇలాంటి ఇంటిలో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదని నమ్మకం.

పదే పదే గాజు వస్తువులు పగిలితే : ఇంట్లోని గాజు వస్తువులు పదే పదే పగిలిపోతుంటే అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ సంకేతం ఆర్థిక సమస్యలను సూచిస్తుంది. అద్దం పగిలిన ఇంటికి పెద్ద ఇబ్బంది రాబోతోందని కూడా నమ్మకం. కనుక విరిగిన గాజు వస్తువులను ఇంటి నుండి తీసివెయ్యండి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు