Chanakya Niti: మనిషి జీవితంలో ఈ నాలుగు విషయాలు అత్యంత విలువైనవంటున్న చాణక్య
ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో 4 విషయాల గురించి కూడా ప్రస్తావించాడు. జీవితంలో ఈ 4 విషయాలు పాటించడం ద్వారా.. వ్యక్తి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. అవి ఏమిటో తెలుసుకుందాం ఈరోజు..
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. తన జ్ఞానంతో తన విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. ఆయన తన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు. ఈ విధానాలను అనుసరించడం ద్వారా.. ఎటువంటి పెద్ద సమస్యను అయినా సులభంగా పరిష్కరించవచ్చు. తన విధానాలతో ఆలోచనతో ఆచార్య చాణక్యుడు ఒక సాధారణ బాల చంద్రగుప్తుడిని చక్రవర్తిగా చేశాడు. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో 4 విషయాల గురించి కూడా ప్రస్తావించాడు. జీవితంలో ఈ 4 విషయాలు పాటించడం ద్వారా.. వ్యక్తి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. అవి ఏమిటో తెలుసుకుందాం ఈరోజు..
- ఆచార్య చాణక్య ప్రకారం.. పేదవారికి సహాయం చేయడం ప్రపంచంలోనే అతి గొప్ప పని అని చెప్పారు. అవసరమైన వ్యక్తికి ఆహారం, నీరు ఇవ్వడం చాలా గొప్పదనంగా పరిగణించబడుతుంది.
- ఆచార్య చాణక్య ప్రకారం.. గాయత్రీ మంత్రం చాలా ప్రభావవంతమైన మంత్రంగా పరిగణించబడుతుంది. ఈ మంత్రం కూడా చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఆచార్య చాణక్యుడు ప్రకారం, గాయత్రీ మంత్రం కంటే గొప్ప మంత్రం లేదు. తల్లి గాయత్రిని వేదమాత అంటారు. నాలుగు వేదాలు గాయత్రీ నుండి ఉద్భవించాయి.
- ఆచార్య చాణక్య ప్రకారం.. ఏకాదశి అత్యంత పవిత్రమైన తిథిగా పరిగణించబడుతుంది. ఏకాదశి రోజున పూజించడం, ఉపవాసం ఉండటం వల్ల విష్ణువు అనుగ్రహం భక్తులపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఏకాదశి విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ప్రతి నెలలో 2 ఏకాదశి తిథిలు ఉంటాయి. ఏడాదికి దాదాపు 24 ఏకాదశులు వస్తాయి.
- ఆచార్య చాణక్యుడు ప్రకారం.. తన తల్లిదండ్రుల ప్రేమగా చూసుకుంటూ.. వారికీ ప్రేమగా సేవ చేసే తనయుడు గొప్పవాడు. ఇలాంటి వ్యక్తి పుణ్యం కోసం ఏ తీర్థయాత్రకు వెళ్లాల్సిన అవసరం లేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)