Chanakya Niti: విజయం కోసం చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. డబ్బుకు లోటు ఉండదు

|

Apr 24, 2024 | 2:31 PM

ప్రతి ఒక్కరూ ఆనందం, శ్రేయస్సు, సంపద , కీర్తి దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొందాలని మీరు కోరుకుంటే మీరు ఆచార్య చాణక్య  చెప్పిన ఈ 5 విషయాలను తప్పక తెలుసుకోవాలి. ఇవి  జీవితంలో చాలా మార్పును తీసుకురావచ్చు. దీంతో సమస్యలు క్రమంగా తగ్గుతాయి. డబ్బు కొరత కూడా తొలగిపోతుంది. విజయం కోసం ఆచార్య చాణక్య  చెప్పిన 5  సక్సెస్ సూత్రాలను గురించి తెలుసుకుందాం. వీటిని గుర్తించి నడుచుకుంటే జీవితంలో సులభంగా విజయం సాధించవచ్చు.  

Chanakya Niti: విజయం కోసం చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. డబ్బుకు లోటు ఉండదు
Chanakya Niti
Follow us on

ఎవరైనా జీవితంలో విజయం సాధించాలనుకుంటే కొన్ని విధానాలను అనుసరించడం ద్వారా జీవితంలో సులభంగా విజయం సాధించవచ్చు. నేటి కాలంలో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆనందం, శ్రేయస్సు, సంపద , కీర్తి దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొందాలని మీరు కోరుకుంటే మీరు ఆచార్య చాణక్య  చెప్పిన ఈ 5 విషయాలను తప్పక తెలుసుకోవాలి. ఇవి  జీవితంలో చాలా మార్పును తీసుకురావచ్చు. దీంతో సమస్యలు క్రమంగా తగ్గుతాయి. డబ్బు కొరత కూడా తొలగిపోతుంది. విజయం కోసం ఆచార్య చాణక్య  చెప్పిన 5  సక్సెస్ సూత్రాలను గురించి తెలుసుకుందాం. వీటిని గుర్తించి నడుచుకుంటే జీవితంలో సులభంగా విజయం సాధించవచ్చు.

అలాంటి వారికి మంచి జ్ఞానం ఉంటుంది:

శాస్త్ర నియమాలను నిరంతరం ఆచరిస్తూ విద్యను పొందే వ్యక్తి.. ఏది తప్పు, ఏది ఒప్పు , శుభా అశుభాల గురించి జ్ఞానాన్ని పొందుతారు. ఇలాంటి వ్యక్తికి ఉత్తమ జ్ఞానం ఉంటుంది. అంటే అలాంటి వ్యక్తులు జీవితంలో అపారమైన విజయాన్ని సాధిస్తారు. ఎటువంటి కష్ట, నష్టాలు ఎదురైనా సులభంగా ఎదుర్కొంటారు.

అలాంటి వారికి దూరంగా ఉండండి

కొందరు వ్యక్తులకు అంటే దుష్ట భార్యకు, తప్పుడు స్నేహితుడికి, సోమరి సేవకులకు, శత్రువులకు ఎప్పుడూ దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. అంతేకాదు వీరితో చెలిమి మరణాన్ని ఆలింగనం చేసుకోవడం వంటిది. అంటే అలాంటి వ్యక్తులు తమ ప్రయోజనాల కోసం స్నేహం చేస్తారు. మీకు అవసరమైన సమయంలో మమ్మల్ని వదిలేస్తారు.

ఇవి కూడా చదవండి

డబ్బులు ఆదా చేసే గుణం

ఎప్పుడు ఎలా ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయో ఎవరికీ తెలియదు. ఆర్ధిక ఇబ్బందులను నివారించడానికి ప్రతి వ్యక్తి తమ సంపాదనలో కొంత డబ్బును ఆదా చేయాలి. అదే సమయంలో తన సంపదను వదులుకుని కూడా భార్యను రక్షించాలి.

ఇలాంటి చోట ఉండకూడదు

ఎవరైనా సరే తమకు గౌరవం లభించని ప్రాంతాల్లో అస్సలు జీవించకూడదు. ఉపాధి మార్గాలు లేని చోట,  మనుషులు నివసించకూడదు. మీకు స్నేహితులు లేని చోట. జ్ఞానం లేని ప్రదేశాన్ని కూడా వదిలివేయాలి. ఆ దిశగా అడుగులు ముందుకు వేయాలి.

ప్రజలు జీవితంలో ఈ విధంగా పరీక్షించబడతారు.

చెడు సమయం ఎదురైనప్పుడు సేవకుడు పరీక్షించబడతాడు. జీవితంలో కష్టాలు చుట్టుముట్టినప్పుడు బంధువులు పరీక్షించబడతారు. సంక్షోభ సమయాల్లో స్నేహితుడు పరీక్షించబడతాడు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు భార్యకు పరీక్ష వస్తుంది. అంటే కష్టాల్లో ఎవరు అండగా నిలబడతారో గుర్తించుకుని మనిషి నడుచుకోవాలి.

ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఎవరు నడుచుకుంటే వారు తమ జీవితంలో సక్సెస్ అందుకుంటాడని చాణుక్యుడు చెప్పాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు