
ఆచార్య చాణక్యుడు తన విధానాలను నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. ఆచార్య చాణక్యుడు పూర్వకాలంలో అత్యంత జ్ఞానవంతుడు, రాజనీతజ్ఞుడు కూడా పేరు పొందాడు. తన జీవితకాలంలో అర్ధ శాస్త్రం, నీతి శాస్త్రం, పంచ తంత్ర అనేక రకాల పుస్తకాలను రచించాడు. అందులో ఒకటి చాణక్య నీతి. ఇందులో ఆచార్య చాణక్యుడు మనిషి జీవితంలో విజయ సాధించాలంటే ఏమి చేయాలి? ఏమి చేయకూడదో కూడా చెప్పాడు. కొంతమంది వ్యక్తులతో స్నేహం మాత్రమే కాదు పరిచయం కూడా జీవితంలో మిమ్మల్ని ఎదగనివ్వరని చెప్పాడు. అటువంటి వ్యక్తుల గురించి తన నీతి శాస్త్రం ప్రస్తావించాడు. ఎవరైనా సరే ఎక్కువ సమయం ఇటువంటి వ్యక్తులతో గడిపితే.. పూర్తి చేసిన పని కూడా చెడిపోవడం ప్రారంభమవుతుంది. కనుక ఇటువంటి వ్యక్తులకు వీలైంత వరకూ దూరంగా ఉండమని సూచించాడు. వారు ఎవరో తెలుసుకుందాం..
ఆచార్య చాణక్యుడి ప్రకారం ఎవరైనా సరే ఎప్పుడూ మూర్ఖులతో సహవాసం చేయరాదు. వీలైనంత వరకూ మూర్ఖులకు దూరంగా ఉండాలి. ఇలాంటి వ్యక్తులు, తమను తాము ఉన్నతంగా, ఉత్తమంగా భావిస్తుంటారు. ఎవరైనా మూర్ఖుడితో గడిపితే అతను మీకు ఎంత దూరంలో ఉన్నా అతను మీ పనిని, మీ సమయాన్ని పాడు చేస్తాడు. మూర్ఖులు జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని, ఈ నిర్ణయాలు మీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు.
చాణక్య నీతి ప్రకారం ప్రతి చిన్న విషయానికి ఏడ్చేవారు లేదా ఎటువంటి పనిలోనైనా తప్పులు వెదికే అలవాటు ఉన్న వ్యక్తుల నుంచి మీరు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తుల నుంచి మీరు వీలైనంత దూరం పాటించాలి. ఇలాంటి వ్యక్తులు చాలా ప్రతికూల మనస్తత్వం కలిగి ఉంటారు. ఆ మనసతత్వం మీపై కూడా ప్రభావం చూపుతుంది. ఇలాంటి వ్యక్తుల వల్ల చాలాసార్లు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.
ఆచార్య చాణక్యుడి ప్రకారం తనను తాను అందరికంటే ఉత్తమురాలిగా, ఉన్నతంగా భావించే స్త్రీ నుంచి మీరు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. ఇలాంటి స్త్రీలకు అబద్ధం చెప్పడం చాలా బాగా తెలుసు. ఇది మాత్రమే కాదు అలాంటి స్త్రీలు కొన్నిసార్లు అబద్ధాలతో, కఠినమైన మాటలతో ఇతరులను బాధపెట్టడానికి కూడా వెనుకాడరు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు