Chanakya Niti: కొన్ని విషయాలు క్షణికానందాన్ని ఇస్తాయి.. వాటిని చూసి పొంగిపోకూడదు అంటున్న చాణక్య

|

Mar 11, 2022 | 1:31 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya) తన జీవితంలో ఎదురైన అనుభవాలను నీతి శాస్త్రం(Niti Sastra)గా రచించాడు. ఈ నీతి శాస్త్రం నేటికీ అనుసరణీయం. మనిషి తన జీవితాన్ని సంతోషంగా, విజయవంతం..

Chanakya Niti: కొన్ని విషయాలు క్షణికానందాన్ని ఇస్తాయి.. వాటిని చూసి పొంగిపోకూడదు అంటున్న చాణక్య
Chanakya Neeti
Follow us on

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya) తన జీవితంలో ఎదురైన అనుభవాలను నీతి శాస్త్రం(Niti Sastra)గా రచించాడు. ఈ నీతి శాస్త్రం నేటికీ అనుసరణీయం. మనిషి తన జీవితాన్ని సంతోషంగా, విజయవంతం జీవించడానికి అనేక ఉపయోగకరమైన సూచనలు ఉన్నాయి.  కొన్ని ఆనందాలు తాత్కాలికమని ఆచార్య చెప్పాడు.. అలా   క్షణికమైన ఆనందాలను గురించి ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో చెప్పిన విషయాలను గురించి తెలుసుకుందాం..

సూర్యుడు కాంతివంతంగా ఉన్నసమయంలో ఆకాశంలో అకస్మాత్తుగా మేఘాలు కనిపించినప్పుడు..  అది చాలా చూడడానికి బాగుంటుంది. కానీ మబ్బులు మేఘాలు తొలగిపోగానే మళ్ళీ సూర్యుడి వేడి ప్రసరించడం మొదలు పెడతాడు. కనుక అలాంటి సమయంలో పొందే ఆనందం క్షణికమైనది. ఎందుకంటే కొంత సమయం తర్వాత అదృశ్యమవుతుంది. కనుక అటువంటి వాటి పట్ల ఆకర్షితులు కాకూడదు.

చెడ్డ వ్యక్తి తో  స్నేహం , శత్రుత్వం రెండూ హాని కలిగిస్తాయని ఆచార్య చాణక్యుడు నమ్మాడు. అలాంటి వారి స్నేహంతో కొంచెం మేలు జరిగినా అది అతని స్వార్థం వల్లనే అవుతుంది.  చెడు తలపులు ఉన్న వ్యక్తికి మీ ఉపయోగం లేని రోజు,  ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తాడు. కనుక అటువంటి వారి గురించి పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిది.

చెడ్డ వ్యక్తితో ప్రేమలో పడకూడదు. చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తుల మీద మీరు ఎంత ప్రేమ చూపించినా వారు తమ అసలు స్వభావాన్ని మరచిపోరు. అలాంటి వారితో స్నేహం క్షణిక ఆనందాన్ని ఇవ్వవచ్చు. ఎక్కువ కాలం ఆ ఆనందం  నిలబడదు.

పెద్ద పెద్ద మాటలు  చెప్పి.. భారీ హామీలు ఇచ్చేవారు ఎవరికైనా క్షణిక ఆనందాన్ని ఇవ్వగలరు. అయితే కొంతమంది అది చేస్తాం ఇది చేస్తాం అతను మాటలు చెప్పరు. తాము చేయాలనుకున్న పనులను చేసి చూపిస్తారు.

అటువంటి వ్యక్తుల వలలో పడకూడదని.. వారి నేచర్ గడ్డి వంటిదని ఆచార్య చెప్పాడు. గడ్డి ఒక్క క్షణం మండి వెలుగు ఇచ్చినా.. వెంటనే మళ్ళీ చీకటిని ఎదుర్కోవలసి ఉంటుంది.
Also Read:

జాతీయ పార్టీ దిశగా అడుగులు వేస్తోన్న ఆప్ పార్టీకి, అరవింద్‌కు శుభాకాంక్షలు చెప్పిన కమల్ హాసన్