Chanakya Niti: ఈ 5 లక్షణాలు ఉన్న వ్యక్తి ఎప్పుడు వైఫల్యం చెందడు.. విజయం ఇతని సొంతం అంటున్న చాణక్య

Chanakya Niti: ఆచార్య చాణుక్యుడు(Acharya Chanakya)నకు ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు, సామాజిక శాస్త్రం మొదలైన అన్ని విషయాలపై మంచి పరిజ్ఞానం ఉంది. చాణక్యుడి 

Chanakya Niti: ఈ 5 లక్షణాలు ఉన్న వ్యక్తి ఎప్పుడు వైఫల్యం చెందడు.. విజయం ఇతని సొంతం అంటున్న చాణక్య
Chanakya
Image Credit source: Chanakya

Updated on: Feb 21, 2022 | 9:35 AM

Chanakya Niti: ఆచార్య చాణుక్యుడు(Acharya Chanakya)నకు ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు, సామాజిక శాస్త్రం మొదలైన అన్ని విషయాలపై మంచి పరిజ్ఞానం ఉంది. చాణక్యుడి  తన జీవిత సారాన్ని, అనుభవాలను నీతి శాస్త్రంలో పొందుపరిచాడు. చాణుక్యుడు ఏదైనా పరిస్థితిని ముందుగానే ఊహించి, దానిని ఎదుర్కోవటానికి వ్యూహాన్ని సిద్ధం చేసేవాడు. చాణుక్యుడు రచించిన నీతి పుస్తకంలోని అంశాలు నేటికీ అనుసరణీయమని పెద్దల నమ్మకం. మనిషి వైఫల్యాన్ని సులభంగా విజయంగా మార్చుకోవచ్చునని చాణక్య చెప్పారు. అవి ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..

  1. కష్టపడి పనిచేసే తత్వం: మనిషి ఎదుగుదలకు శ్రమకు మించిన ప్రత్యామ్నాయం లేదు. ఏదో ఒక రోజు.. శ్రమకు తగిన ఫలం ఖచ్చితంగా లభిస్తుంది. కనుక పనిచేసే విషయంలో బద్ధకం వద్దు..  కష్టపడి పనిచేయడమే విజయానికి తొలి మెట్టని చాణక్య చెప్పారు.
  2. ఆత్మవిశ్వాసం: మనిషి జీవితంలో అతి పెద్ద ఆస్తి అతని ఆత్మవిశ్వాసం. మనిషికి ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా సులభంగా ఎదుర్కోగలడు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తులు ఏ పనిలోనూ అపజయం పొందరు.
  3. సంపాదించిన జ్ఞానం: మనిషి తాను సంపాదించుకున్న జ్ఞానం ఎప్పుడూ వ్యర్థం కాదు. పుస్తక జ్ఞానం,  పని చేయడం ద్వారా పొందిన జ్ఞానం,  అనుభవ జ్ఞానం ఏదైనా సరే ఈ అనుభవం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఓడిపోడు.
  4. డబ్బు, సంపాదన : మనిషి జీవితంలో డబ్బు అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలో మంచి, చెడులు ఎప్పుడైనా వస్తాయి. అందువల్ల.. జీవితంలో విజయం సాధించడానికి ఎల్లప్పుడూ అదనపు డబ్బును కలిగి ఉండాలి. చెడు కాలంలో డబ్బు మంచి సహాయకారి.
  5. అప్రమత్తంగా ఉండండి :  జీవితంలో విజయం సొంతం చేసుకోవాలంటే..  మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎక్కడ నివసించినా లేదా పనిచేసినా, కళ్ళు,చెవులు అన్నింటిని పరిసరాలను పరిశీలించేందుకు ఉపయోగించాలి.

ఈ ఆర్టికల్‌లో మేము సాధారణ పాఠకుని ఆసక్తిని అనుసరించి ఇస్తున్నది మాత్రమే.. 

Also Read:

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూత