Chanakya Niti: అలాంటి ఆలోచనలకు పుల్‌స్టాప్ పెట్టాలంటే.. ఆ ముగ్గురు వ్యక్తులకు దూరంగా ఉండండి
ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన మనస్తత్వాలు కలిగి ఉంటారు. లక్షణాలు, ప్రవర్తన వ్యక్తిని బట్టీ మారుతూ ఉంటాయి. ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషుల మనస్తత్వాలు కూడా ఒకే రకంగా ఉండరు. ఈ క్రమంలో..
ఆచార్య చాణక్యుడు(Chanakya Niti) సమర్థవంతమైన ఆర్థికవేత్త, వ్యూహకర్త, దౌత్యవేత్త, రాజకీయవేత్త. ఆచార్యుడు తన జీవితంలో చాలా కష్టమైన సమయాన్ని కూడా జయించాడు. ప్రతి పరిస్థితిని దృఢంగా ఎదుర్కోవడమే కాకుండా.. ఆ పరిస్థితిని తన శక్తిగా మార్చుకున్నాడు. మనం ఎవరతో ఎలా వ్యవహరించాలనే అంశంపై చాలా పుస్తకాలను రచించారు. ఆచార్య తన అనుభవాల సారాంశాన్ని చాణక్య నీతి అనే పుస్తకంలో రాశారు. ఒక వ్యక్తి తన జీవితంలో ఆచార్య చెప్పిన బోధనలను అమలు చేయడానికి ప్రయత్నిస్తే.. ఆ వ్యక్తి తనను తాను అన్ని కష్టాల నుంచి సులభంగా రక్షించుకోగలడు.ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాలను పాటిస్తే ఎలాంటి సమస్య నుంచైనా ఇట్టే బయటపడొచ్చు. ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన మనస్తత్వాలు కలిగి ఉంటారు. లక్షణాలు, ప్రవర్తన వ్యక్తిని బట్టీ మారుతూ ఉంటాయి. ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషుల మనస్తత్వాలు కూడా ఒకే రకంగా ఉండరు. ఈ క్రమంలో ఏ వ్యక్తినిక మనం దగ్గరగా ఉండాలి.. ఎలాంటి వారితో స్నేహం చేయాలి.. ఎలాంటి వ్యక్తికి వివరించాలి.. ఎలాంటి వ్యక్తులను మనం దూరం పెట్టాలి.. వంటి చాలా విషయాలను ఆయన తన నీతిగ్రంధంలో పేర్కొన్నారు. చాణక్య నీతిలో, ఆచార్య మూడు రకాల వ్యక్తులకు దూరంగా ఉండాలని సూచించారు.అయితే ఆచార్య చాణక్యుడు ఇలాంటి పలు విషయాలను తెలియజేశారు. అవేమిటంటే..
ఆచార్య చాణక్యుడు ఈ శ్లోకాల ద్వారా మూడు రకాల వ్యక్తులకు దూరంగా ఉండాలని సూచించారు.
మూర్ఖశిష్యోపదేశేన దుష్టస్త్రీ భరణేన చ దుఃఖితైః సంప్రయోగేణ పండితోऽప్యవ సీదతి
బుద్ధీహీనుడైన శిష్యునికి ధర్మోపదేశం చేసినా, వ్యభిచారిణి కఠినభాషిణి అయిన స్త్రీని పోషించినా, నానారోగములచే పీడితులును, ప్రియజనుల వియోగ పీడితులును, ధననాశాది కారణములచే దుఃఖితులును ఐనవారితో వ్యవహారం చేయుటచే బుద్ధిమంతుడైన మనుష్యుడుకూడ.. దుఃఖములపాలు కావలసివచ్చును – అని భావం.
తెలివితక్కువ వ్యక్తితో ఎక్కువగా మాట్లాడకండి..
ఆచార్య చాణక్యుడు ఒక మూర్ఖుడితో ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడకూడదని అంటారు. అతనికి ఎక్కువగా వివరించడానికి ప్రయత్నించకూడదని అంటారు. మీరు అతనిని ఒప్పించడానికి ఎంత ప్రయత్నించినా.. అతను ఎల్లప్పుడూ తనను తాను సరైన, ఉత్తమంగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అటువంటి పరిస్థితిలో మీ శక్తి వృధా అవుతుంది. అలాగే ప్రతికూలత, కోపం, చికాకు మీలో పెరుగుతుంది. ఇతరుల వల్ల తన మనసును పాడు చేసుకోకూడదు కాబట్టి అలాంటి వ్యక్తికి దూరంగా ఉండండి.
దుర్మార్గులను కరుణించకు..
చాణక్య నీతి ప్రకారం.. ఇతరులకు సహాయం చేయడం మంచి విషయమే.. అయితే ఇతరుల పట్ల తప్పుడు ఆలోచనలు కలిగి, అసూయపడే దుష్ట స్త్రీకి దూరంగా ఉండాలని అభిప్రాయ పడుతారు. అలాంటి స్త్రీ ఇంట్లో కష్టాలను పెంచుతుందని.. మీరు వారిపై దయ కలిగి ఉంటే.. వారు మీ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇతరులకు హాని కలిగించేందుకు ఉపయెగించుకుంటారు. కాబట్టి ఇలాంటి ప్రతికూల ఆలోచనలు ఉన్న స్త్రీల పట్ల దయ చూపవద్దంటారు చాణక్యుడు.
దేవుణ్ణి దూషించేవాడికి దూరంగా ఉండండి..
నిత్యం దుఃఖంలో మునిగితేలుతూ, ప్రతి విషయంలోనూ విధిని, భగవంతుడిని నిందించేవారికి దూరంగా ఉండాలని అంటారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడూ తమలో సంతృప్తిని నింపుకుని ఉంటారు. ఇతరులను సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తుంటారు. మీరు వారితో కలిసి ఉంటే అలాంటి వ్యక్తులు మీలోకూడా నెగటివ్ ఆలోచనలను నింపుతారు.
ఇవి కూడా చదవండి: Medaram Jathara 2022: నేడు మేడారానికి సీఎం కేసీఆర్.. కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకోనున్న ముఖ్యమంత్రి..
Singapore PM: సింగపూర్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు.. భారత్ తీవ్ర అభ్యంతరం.. రాయబారికి సమన్లు..