ఆచార్య చాణక్యుడు గొప్ప దౌత్యవేత్త, ఆర్థికవేత్త, రాజకీయవేత్త. తన విధానాల బలంతో ఒక సాధారణ బాల చంద్రగుప్తుడిని చక్రవర్తిగా చేసాడు. ఆయన చెప్పిన విధానాలనే నేటికీ చాలా మంది అనుసరిస్తున్నారు. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించాడు. ఈ విధానాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు. ఆచార్య నీతి శాస్త్రంలో కుటుంబం, సంబంధాలు, డబ్బు, వ్యాపారం ,ఉద్యోగానికి సంబంధించిన అనేక విషయాలను వివరించారు. వ్యక్తి జీవితం పోరాటంతో నిండి ఉంటుంది. నీతి శాస్త్రం ప్రకారం .. ప్రతి వ్యక్తి విజయం సాధించాలని కోరుకుంటాడు. కానీ ఒక వ్యక్తి కొన్ని అలవాట్లు విజయం సాధించడంలో అవరోధంగా మారతాయి. ఈ అలవాట్లను వదులుకోని వ్యక్తి నాశనమైపోతాడు. ఈ అలవాట్లు అతన్ని పేదవాడిని చేస్తాయి. ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం.
చెడు స్నేహాసాలు:
చెడు సహవాసాలను చేసి.. వారితో జీవించే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విజయం సాధించలేడు. అలాంటి వ్యక్తి ఎప్పుడూ గౌరవానికి అర్హుడు కాదు. చెడు సహవాసం కలిగిన వ్యక్తిని ఓటమి దిశగా తీసుకెళుతుంది. కనుక చెడు సాంగత్యానికి దూరంగా ఉండండి. దీనితో మీరు జీవితంలో సులభంగా విజయం సాధించగలుగుతారు. అహంభావం ఉన్న వ్యక్తి కూడా ఎప్పుడూ విజయాన్ని పొందలేడు.
నిధుల దుర్వినియోగం:
ఆచార్య చాణక్యుడు ప్రకారం, చాలా మంది డబ్బును తప్పుడు పనులకు ఉపయోగిస్తారు. డబ్బు ప్రజలకు హాని చేయడానికి ఉపయోగిస్తారు. అలాంటి వారిని సమాజంలో ఎప్పుడూ గౌరవించదు. అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ విజయం సాధించలేరు. అలాంటి వారి ఇళ్లలో లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉండదు. డబ్బులను దుర్వినియోగం చేసే వ్యక్తులు మోసపూరితంగా ఉంటారు.
కోపం:
ఆచార్య చాణక్యుడు ప్రకారం.. కోపం ఒక వ్యక్తికి అతిపెద్ద శత్రువు. కోపం మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. కోపం వల్ల వ్యక్తి తన సర్వం కోల్పోతాడు. అంతేకాదు.. ఒక వ్యక్తి అత్యాశతో ఉండకూడదు. దురాశ ఒక వ్యక్తి తన బాధ్యతలను మరచిపోయేలా చేస్తుంది. ఒక వ్యక్తి ఈ అలవాటును వదిలేస్తే, అతను జీవితంలో చాలా విజయాలు సాధించగలడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)