Chanakya Niti: ఈ మూడు రకాల వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి.. లేకుంటే మీరు తర్వాత పశ్చాత్తాపపడతారంటున్న చాణక్య..

Chanakya Niti: గొప్ప వ్యూహకర్త ఆచార్య చాణక్యుడు. తన జీవితంలో తనకు ఎదురైన అనుభవాలను పలు పుస్తకాలుగా రచించాడు. చాణుక్యుడు రచించిన నీతిశాస్త్రంలో మానవ జీవిత విధానం,..

Chanakya Niti: ఈ మూడు రకాల వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి.. లేకుంటే మీరు తర్వాత పశ్చాత్తాపపడతారంటున్న చాణక్య..
Chanakya Niti

Edited By: Phani CH

Updated on: Jan 17, 2022 | 1:31 PM

Chanakya Niti: గొప్ప వ్యూహకర్త ఆచార్య చాణక్యుడు. తన జీవితంలో తనకు ఎదురైన అనుభవాలను పలు పుస్తకాలుగా రచించాడు. చాణుక్యుడు రచించిన నీతిశాస్త్రంలో మానవ జీవిత విధానం, రాజ్యపాలన , మంచి చెడులు ఇలా అనేక విషయాలను ప్రస్తావించాడు. ఈ నీతిశాస్త్రంలో మనిషి జీవిత విధానానికి బంధించిన అనేక విషయాలను చెప్పాడు.  చాణక్య నీతి ప్రకారం… తన చుట్టూ ఉన్న వ్యక్తుల గుణగణాలను గుర్తించే సామర్థ్యం లేని వ్యక్తిని ఎవరూ బాగుచేయలేరు.. ముఖ్యంగా ఎవరితోనైనా కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండకపోతే జీవితంలో అనుకోని నష్టాలను ఎదుర్కొంటారు. అవి ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..

స్వార్థపరులతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి: చాణక్య నీతి ప్రకారం.. స్వార్థపరులతో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.  అలాంటి వ్యక్తులు ఎప్పుడూ తమ లాభం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. స్వార్థపరుడు తన ప్రయోజనాలను తప్ప ఇతరుల ప్రయోజనాలను పట్టించుకోడు. అలాంటి వ్యక్తిని నమ్మకూడదు.. వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తి అవసరమైతే.. ఎవరినైనా మోసం చేయగలడు. అవకాశం ఇచ్చినప్పుడు తమ స్వార్ధ ప్రయోజనం గురించి మాత్రమే ఆలోచిస్తాడు.

కోపంతో ఉన్న వ్యక్తికి దూరంగా ఉండండి – చాణక్య నీతి ప్రకారం..  కోపిష్టికి, ఆయుధాలను కలిగి ఉన్న వ్యక్తికి ఎల్లప్పుడూ దూరంగా ఉండండి. ముఖ్యంగా కోపంగా ఆయుధాలను పట్టుకున్న వ్యక్తికీ వీలైనంత దూరంగా ఉండండి.. అలాంటి  వ్యక్తులు కోపంతో ఎవరికైనా హాని కలిగించే విధంగా ప్రవర్తిచగలరు. అప్పుడు మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.

అతిగా పొగిడేవారికి దూరంగా ఉండండి: చాణక్య నీతి ప్రకారం.. మీ మీడురుగా మిమ్మల్ని అవసరం ఉన్నా లేకపోయినా  పొగిడే వ్యక్తులకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తులు ఎప్పుడూ తమ స్వలాభం గురించే ఆలోచిస్తారు. చాణక్య నీతి ప్రకారం.. ఎదురుగా పొగిడే వ్యక్తి ,  వెనుక చెడు చేసే వ్యక్తి నమ్మదగినవాడు కాదు. అలాంటి వారిని ఎప్పుడూ శ్రేయోభిలాషులుగా పరిగణించవద్దని చాణుక్యుడు చెప్పాడు.

Also Read:

Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో

 కాకతీయ మెడికల్ కాలేజీని వదలని కరోనా మహమ్మారి.. మరో 15 మంది మెడికోలకు పాజిటివ్..

నేడు ధనుర్మాసం 27 వ రోజు.. కృష్ణుడితో కలిసి పాల అన్నం తినాలని కోరుతున్న గోదాదేవి..