Bhishma Ekadashi: భీష్మ ఏకాదశి విశిష్టత.. ఈ పర్వదినం రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కలిగే అద్భుత ఫలితం..

Bhishma Ekadashi: భీష్మ ఏకాదశి విశిష్టత.. ఈ పర్వదినం రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కలిగే అద్భుత ఫలితం..
Bhishma Niti

Bhishma Ekadashi:హిందువులకు మాఘమాసం(Maghamasam) అతి పవిత్రమైన మాసం. ఈ మాసంలో చేసే స్నానం, పర్వదినాలకు ప్రముఖ స్థానం ఉంది. మాఘమాసం శుక్ల పక్షం ఏకాదశి(Ekadashi)

Surya Kala

|

Feb 12, 2022 | 5:01 PM

Bhishma Ekadashi: హిందువులకు మాఘమాసం(Maghamasam) అతి పవిత్రమైన మాసం. ఈ మాసంలో చేసే స్నానం, పర్వదినాలకు ప్రముఖ స్థానం ఉంది. మాఘమాసం శుక్ల పక్షం ఏకాదశి(Ekadashi ఎంతో పవిత్రమయినది. ఈరోజున భీష్మ ఏకాదశిగా అంతర్వేది ఏకాదశి(Antarvedi Ekadashi)గా ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీదన ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. ఈ విష్ణు సహస్రనామాలతో పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి.. అటువంటి విష్ణు సహస్రనామాల పారాయణం ఎంతో విశిష్టమైంది. ఇక ఈ భీష్మ ఏకాదశినాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం.

భీష్మ ఏకాదశి విశిష్టత: భీష్ముడు గంగా, శంతనుల ఎనిమిదవ సంతానం. అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి శంతనుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయడం కోసం తండ్రి ఆనందం కోసం, సుఖసంతోషాల కోసం దేవవ్రతుడు… ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని పెళ్లి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి.. ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యతిగాంచాడు. తనయుడి త్యాగానికి సంతసించిన తండ్రి.. భీష్ముడికి స్వచ్చంద మరణం పొందే వరాన్ని ఇచ్చాడు.

కౌరవుల తరపున కురుక్షేత్ర రణక్షేత్రంలో యుద్దాన్నికి దిగిన భీష్ముడు.. అర్జునుడు బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయ్యపైకి చేరుకొని.. మరణించే మంచి సమయం కోసం ఎదురు చూస్తూ.. పాండవులకు రాజ్య ధర్మం ఉపదేశించాడు. అంపశయ్యగతుడైన భీష్ముని చూసి దేవతలు సైతం దుఃఖించారు. అంపశయ్యపై ఉన్న భీష్ముడు మరణ వేదనను అనుభవిస్తూ… మానవజన్మకు మహత్తర వరమైన మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ గడిపాడు భీష్ముడు.

ధర్మ రాజు సందేహానికి సమాధానంగా లీలా మానుష విగ్రహుడైన ఈ శ్రీకృష్ణుడే… “జగత్ ఏభుం దేవదేవమనంతం పురుషోత్తమం” అంటూ ప్రారంభించి, “విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు:” అంటూ విష్ణసహస్రనామావళిని వేయి విధాలుగా కీర్తిస్తూ, విశ్వకళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించాడు. మాఘశుద్ధ ఏకాదశి తిథిని భీష్మ సంస్మరణదినంగా శ్రీకృష్ణుడు కానుకగా ఇవ్వగా.. మాఘశుద్ధ అష్టమి తిథిరోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణునిలో లీనమైంది. మహాభారత యితిహాసంలోని ఓ మహామహుని మహాప్రస్థానం ఇలా ముగిసింది.

ఈ భీష్మ ఏకాదశి రోజున నరసింహ కల్యాణం జరిపిస్తారు. అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారికి కళ్యాణం , అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో, సింహాచలం నరసింహ స్వామి ఆలయంలో, యాదగిరి గుట్ట, భద్రాచాలం సీతారాముల వారి ఆలయంలో ప్రత్యేకపూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే ఈరోజు చేసే ఉపవాసం అత్యంత ఫలదాయకం అని పెద్దలు చెబుతారు.

భీష్మ ఏకాదశి పసుపు రంగు: ముఖ్యంగా ఈరోజు పసుపు రంగుకు విశిష్టత ఉంది. లక్ష్మీనరసింహ స్వామి వారికి పసుపు రంగుతో కూడిన పండ్లు, స్వీట్లు స్వామికి ప్రసాదంగా సమర్పించాలి. ఏకాదశి రోజున గోపూజ సకల ఫల దాయకం. గోమాతకు అరటిపండ్లు అందిస్తే అన్నిదోషాలు తొలగిపోతాయి. పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని వినేవారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు ఉవాచ. ఇక భీష్మ ఏకాదశి అని పిలువబడే ఈ రోజున భీష్మాచార్యునిని తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుందని హిందువుల నమ్మకం.

భీష్మ ఏకాదశి పూజ, ఉపవాస నియమాలు:

పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు, కుంకుమలు, తామర పువ్వులు, తులసి దళాలు, జాజిమాలతో అలంకరించాలి. విష్ణు అష్టోత్తరం, నారాయణ కవచం, శ్రీమన్నారాయణ హృదయం, విష్ణు సహస్రనామాలు, విష్ణు పురాణం పఠించాలి. లేదంటే కనీసం”ఓం నమోనారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి. దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహ్మోత్సవ దర్శనం, లక్ష తులసిపూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు.

భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజామందిరాన్ని, ఇంటిని శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలి. అభ్యంగ స్నానం చేసి.. సూచిగా (పసుపు) రంగు దుస్తులను ధరించాలి. ఆ రోజంతా ఉపవాసముండి, రాత్రి జాగారం చేయాలి. దీని నియమాలు దశమి సాయంత్రం నుంచి మొదలై ద్వాదశి వరకు ఉంటుంది.

భీష్మ ఏకాదశి రోజున చేయకూడని పనులు: *మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ, కాయధాన్యాలు వంటి వాటికీ దూరంగా ఉండాలి. *ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉపవాస దీక్ష చేపట్టాలి. *ద్వాదాశి వరకు బ్రహ్మచర్యను సంయమనంతో పాటించాలి. * ఏకాదశి రోజున.. ఇంటిని శుభ్రం చేసుకోకుడదు. ఎందుకంటే చీమలు, పురుగులు వంటి చంపే అవకాశం ఉంటుంది. *తెల్లవారు జామునే నిద్ర లేచి.. సాయంత్రం వరకు నిద్రపోకూడదు. *ఉపవాసం చేసిన వారు భగవంతుడి కీర్తనలు చేస్తూ.. రాత్రంతా జాగరం చేయాలి. *జుట్టు కత్తిరించకూడదు. *ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. *విష్ణు సహస్రనామాలు, భగవద్గీతను పఠించడం మంచింది. *పేదవారికి, ఆకలి అన్నవారికి ఈరోజు అన్నం పెట్టడం పుణ్యంగా పరిగణింపబడుతున్నది.

తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణ వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని, సంతానం ఉన్న వారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయని విశ్వాసం. భీష్ముడు ప్రవచించిన “విష్ణుసహస్రనామస్తోత్రం” ఇప్పటికీ జనుల నోట నర్తిస్తూనే వుంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే వుంది. విష్ణుసహస్రనామ పఠనం సర్వదుఃఖహరణం, సకల శుభకరణం. ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే. ప్రతినామమూ మహామంత్రమే. అది అజరామరం. భీష్ముడు పరమపథం చేరిన మాఘశుద్ధ అష్టమిని “భీష్మాష్టమి”గాను, మాఘశుద్ధ ఏకాదశిని “భీష్మఏకాదశి”గాను హిందువులు జరుపుకుంటారు.

Also Read:  అక్క పెళ్ళిలో చెల్లెలు సందడి.. బిజిలీ బిజిలీ సాంగ్ కు డ్యాన్స్.. నెట్టింట్లో వీడియో వైరల్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu