AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: నేటి నుంచి భవానీ దీక్షల విరమణలు.. ఇంద్రకీలాద్రిపై పటిష్ట ఏర్పాట్లు.. ఉదయం 6 గంటల నుంచే..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇవాళ్టి (గురువారం) నుంచి భవానీ దీక్షల విరమణలు ప్రారంభం కానున్నాయి. మండలం రోజులు నిష్ఠగా పూజలు చేసుకున్న భవానీలు.. తమ తమ మాల ధారణను విరమించేందుకు ఇంద్రకీలాద్రికి..

Vijayawada: నేటి నుంచి భవానీ దీక్షల విరమణలు.. ఇంద్రకీలాద్రిపై పటిష్ట ఏర్పాట్లు.. ఉదయం 6 గంటల నుంచే..
Vijayawada Indrakeeladri
Ganesh Mudavath
|

Updated on: Dec 15, 2022 | 7:08 AM

Share

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇవాళ్టి (గురువారం) నుంచి భవానీ దీక్షల విరమణలు ప్రారంభం కానున్నాయి. మండలం రోజులు నిష్ఠగా పూజలు చేసుకున్న భవానీలు.. తమ తమ మాల ధారణను విరమించేందుకు ఇంద్రకీలాద్రికి వస్తుంటారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు ఐదు రోజుల పాటు అంటే ఈ నెల 19 వరకు దీక్షా విరమణలు జరగనున్నాయి. కరోనా తరువాత జరుగుతున్న దీక్షలు కావడంతో దాదాపు 7 లక్షలకు పైగా భవానీలు.. అమ్మవారి దర్శనం కోసం రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 6 గంటలకు దీక్షల విరమణలు ప్రారంభం కానుండగా.. 6:30 గంటలకు హోమగుండాలు జరగనున్నాయి. ఈ మేరకు ఈవో భ్రమరాంబ, వైదిక కమిటీ సభ్యులు 3 హోమగుండాలును వెలగించి దీక్షలను ప్రారంభించనున్నారు. భవానీల కోసం తాత్కాలిక షెడ్లు, కేశ ఖండన శాలలు ఎర్పాటు చేశారు.

భక్తుల రద్దీ దృష్ట్యా.. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధి వరకు నాలుగు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షణ కు అనుమతి ఇచ్చారు. 10 కౌంటర్ల ద్వారా ప్రసాదాలు విక్రయించేందుకు.. 20లక్షల లడ్డూలు సిద్దం చేశారు. సీతమ్మ వారి పాదాలు, భవాని ఘాట్, పున్నమి ఘాట్ ల వద్ద జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశారు. వేకువ జామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దీక్షాధారులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు.

ఘాట్‌ రోడ్డులో ఓం టర్నింగ్‌ నుంచి రూ.500 టిక్కెట్లు తీసుకున్న భక్తులను అమ్మవారి అంతరాలయ దర్శనానికి అనుమతించనున్నారు. ఈ సారి దీక్షాపరులు అన్నప్రసాదం కూర్చొని తినేలా ఏర్పాట్లు చేశారు. పోలీసు అధికారులు అందుకు తగినట్లు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. అధికారులు అధికారికంగా 15 నుంచి దీక్షల విరమణ తేదీలు ప్రకటించినప్పటికీ కొందరు మాత్రం ముందుగానే గిరి ప్రదక్షిణ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..