ఈ రోజు అన్నా చెల్లెలు పండగ.. సోదరి ఇంటికి వెళ్లి ఎందుకు భోజనం చేయాలో తెలుసా..
భారతీయ సంస్కృతిలో అన్నాచెల్లెల పండుగను తోబుట్టువుల ప్రేమ మరియు ఆప్యాయతకు చిహ్నంగా భావిస్తారు. రాఖీ పండగ లాగానే ఈ రోజు తోబుట్టువుల సంబంధాన్ని మరింతగా పెంచుతుంది. అయితే దీని రూపం, భావోద్వేగ అర్థం భిన్నంగా ఉంటాయి. ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల దీర్ఘాయుష్షు కోసం ఎందుకు ప్రార్థిస్తారో తెలుసుకుందాం..

దీపావళి పండగ జరుపుకున్న రెండు రోజుల తర్వాత జరుపుకునే అన్నా చెల్లెల పండగ సోదర-సోదరీమణుల సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఒక ప్రత్యేక సందర్భం. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల పట్ల ఆప్యాయత, ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇది సోదర-సోదరీమణుల సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండగ మాత్రమే కాదు సోదరుడి పట్ల భద్రత, రక్షణ, బాధ్యత భావనతో కూడా ముడిపడి ఉంటుంది. సోదరీమణులు తమ సోదరుడి దీర్ఘాయుష్షు, ఆనందం, శ్రేయస్సును కోరుకుంటారు. అతనికి ఆహారం, స్వీట్లు, తిలకం అందించడం ద్వారా తమ ప్రేమని తెలియజేస్తారు. అన్నాచెల్లెల పండుగ భావోద్వేగ సంబంధాన్ని, ప్రేమను, సంబంధాలపై నమ్మకాన్ని కూడా బలపరుస్తుంది. టుంబ సంబంధాలను మరింతగా పెంచుతుంది.
సోదరి ప్రార్థన మరియు తిలకం అన్నా చెల్లెల పండగను భగనీ హస్త భోజనం అని కూడా అంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. వారు వారి దీర్ఘాయుష్షు, ఆనందం, శ్రేయస్సు , భద్రత కోసం దేవుడిని ప్రార్థిస్తారు. ఈ సందర్భంగా సోదరీమణులు తమ సోదరుడి నుదిటిపై తిలకం పెట్టి చేతిలో దీపం పట్టుకుని.. అతని రక్షణ, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. ఈ ఆచారం కేవలం ఆధ్యాత్మిక సంప్రదాయం మాత్రమే కాదు సోదరి ఆప్యాయత, ప్రేమ, సేవను కూడా ప్రతిబింబిస్తుంది. ఈ రోజున చేసే ఈ ప్రార్థన సోదరుడు సోదరి మధ్య భావోద్వేగ బంధం, నమ్మకం, రవాన్ని బలపరుస్తుంది. ప్రేమ, ఆప్యాయతతో వారి సంబంధాన్ని పెంచుతుంది.
సాంస్కృతిక ప్రాముఖ్యత ఈ రోజున కొన్ని ప్రాంతాలలో సోదరీమణులు శ్రీకృష్ణుడిని లేదా యమ ధర్మ రాజును తమ సోదరుడిగా పూజిస్తారు. వారు తిలకం పెట్టి.. దీపాలు వెలిగిస్తారు. దీర్ఘాయుష్షు, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. ఈ సంప్రదాయం భగినీహస్త భోజనం కేవలం కుటుంబ సంబంధాల పండుగ మాత్రమే కాదు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన పండుగ అని కూడా నిరూపిస్తుంది.
సూర్య భగవానికి సంధ్యకు పుట్టిన యమధర్మరాజు, యమున అన్నా చెలెల్లు. యమునకు అన్న అంటే విపరీతమైన. అభిమానం. అమె తన అన్న అయిన యమధర్మరాజుని ఎన్నో సార్లు తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచేది. అయితే ఆయనకు యమలోకంలో పాపులను శిక్షించే పనిలో తీరిక ఉండదు. పాపం చెల్లెలు కోరిక తీర్చలేదని భాధపడేవాడు. కాలము గడచిపోతూఉంది. అనుకోకుండా ఒకనాడు ఆయనకు చెల్లెలు ఇంటికి వెళదామని అనకున్నాడు. ఆ రోజు కార్తీక శుద్ద విదియ. యమధర్మరాజు చెల్లెలి ఇంటి వెళ్ళాడు. రాక రాక వచ్చిన అన్నయ్య ను చూచి
కార్తీక మాసంలో శుద్ద విదియ నాడు వచ్చే రోజుకు భగినీ హస్త భోజనము లేక అన్నా చెల్లెలు పండుగ అంటారు. ఈ సంవత్సరం క్యాలెండర్ ప్రకారం చెల్లెలు యమున సంతోషంగా అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలు వండి దగ్గర కూర్చుని కొసరి కొసరి వడ్డించింది. చెల్లి చేతి వంటని యమధర్మరాజు తృప్తిగా తిని..చెల్లెలు తో ప్రేమగా కు ఇషమైన పదార్థములు తో భోజనము పెట్టావు. నీకు ఏదైనా వరం ఇస్తానని కోరుకో అని అన్నాడు. అప్పుడు యమున తన అన్నను లోకకల్యాణము కోసం నాకు ఒక వరము ఇవ్వు. ఈ రోజున ఎవరైనా తన సోదరీమణుల ఇంటికి వెళ్లి సోదరుడు భోజనంచేస్తాడో నీవు ఎట్టి పరిస్థితి లో వారి జోలికి వెళ్ళవద్దు. ఇది నా కోరిక అని యమధర్మరాజుని అడిగింది. చెల్లెలా కోరికను తధాస్తు అంటూ దీవించి యముడు తాన లోకానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఈ రోజున ఎవరైతే అక్క లేదా చెల్లెలు చేతివంట ఎవరైతే భోజనం చేస్తారో ఆ అన్నదమ్ములకు అపముృత్యు దోషం ఉండదని నమ్మకం.
భాయ్ దూజ్ 2025 తేదీ, సమయం
కార్తీక మాసంలో శుద్ద విదియ నాడు వచ్చే రోజుకు భగినీ హస్త భోజనము లేక అన్నా చెల్లెలు పండుగ అంటారు. ఈ సంవత్సరం క్యాలెండర్ ప్రకారం విదియ తిథి అక్టోబర్ 22న రాత్రి 8:16 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ అక్టోబర్ 23న రాత్రి 10:46 గంటలకు ముగుస్తుంది. కనుక అక్టోబర్ 23న అన్నాచెల్లల పండగను జరుపుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున మీ సోదరుడికి తిలకం వేయడానికి మధ్యాహ్నం అత్యంత పవిత్రమైన సమయం.
సోదరుడికి తిలకం ఎలా పెట్టాలంటే
ఈ రోజున అన్న లేదా తమ్ముడికి తిలకం పెట్టే సమయంలో ఉంగరపు వేలుని ఉపయోగించాలి. ఎందుకంటే ఈ వేలు శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంకా కొన్ని సంప్రదాయాలు బొటనవేలును సంపద,కీర్తితో ముడిపడి ఉన్నందున ఈ వేలుని ఉపయోగించమని సూచిస్తున్నాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








