Bhadrachalam: సీతారాముల కల్యాణోత్సవ టికెట్లను ఆన్ లైన్‌లో రిలీజ్ చేయనున్న అధికారులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

|

Mar 03, 2022 | 7:37 AM

Bhadrachalam: సీతారాముల కళ్యాణం(Sita Rama Kalyanam) దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక సీతారాముల కళ్యాణం అంటే.. తెలుగు రాష్ట్రాల్లో వెంటనే భద్రాచలం గుర్తుకొస్తుంది. భద్రాద్రిలో జరిగే సీతారాముల..

Bhadrachalam: సీతారాముల కల్యాణోత్సవ టికెట్లను ఆన్ లైన్‌లో రిలీజ్ చేయనున్న అధికారులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Bhadrachalam Temple
Follow us on

Bhadrachalam: సీతారాముల కళ్యాణం(Sita Rama Kalyanam) దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక సీతారాముల కళ్యాణం అంటే.. తెలుగు రాష్ట్రాల్లో వెంటనే భద్రాచలం గుర్తుకొస్తుంది. భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణానికి లక్షలాదిగా భక్తులు చేరుకుంటారు.  సీతారాముల కల్యాణ మహోత్సవం ఏప్రిల్ 10న, 11న శ్రీరామ మహా పట్టాభిషేకం(Sri rama pattabhishekam) నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కల్యాణోత్సవానికి సంబంధించి ఈరోజు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేయనున్నారు. ఈ మేరకు కల్యాణం టిక్కెట్లను పలు సెక్టార్‌లలో భద్రాచల ఆలయ అధికారులు విక్రయించనున్నారు. భక్తుల కోసం వివిధ రకాలైన టికెట్లను వివిధ ధరల్లో అందుబాటులో ఉంచనున్నారు. భద్రాచల కల్యాణోత్సవానికి రూ. 150 , రూ. 1000, రూ. 2000, రూ.2,500,  రూ.7,500లకు అందుబాటులో ఉంచనున్నారు. ఇక శ్రీరామ పట్టాభిషేకం దర్శనం కోసం రూ. 1000 టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. కల్యాణ మనోత్సవాన్ని కనులారా వీక్షించాలనే ఆసక్తి గల భక్తులు www.bhadrachalarama.org వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. లేదంటే.. భక్తులు భద్రాద్రి ఆలయం ఆఫీసు పనివేళల్లో 08743-232428 నెంబరులో సంప్రదించవచ్చని అధికారులు చెప్పారు.

గత రెండేళ్లుగా భద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవం కరోనా కారణంగా భక్తులు లేకుండానే నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. కరోనా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని భక్తుల మధ్య అంగరంగా నిర్వహించడానికి  అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానున్నాయి.  భద్రాద్రిలో జరిగే సీతారాముల కళ్యాణం చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. చలువ పందిళ్ల క్రింద కూర్చుని సీతారామకళ్యాణం చూడటం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read:

ఈరోజు ఈ రాశివారు ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

ఆలయంలో వింత సంఘటన.. భక్తులను ఆశీర్వదిస్తున్న శునకం.. భగవంతుని లీల అద్భుతం అంటూ వీడియో వైరల్