తెలంగాణలో బద్రీనాథ్‌.. భక్తులు విశేషంగా ఆకట్టుకుంటోంది.. ప్రతిరోజూ రద్దీనే..

| Edited By: Jyothi Gadda

Dec 26, 2023 | 9:28 PM

రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ప్రశాంత వాతావరణం..ఎటు చూడూ ఆధ్మాత్మిక శోభతో తెలంగాణ బద్రీనాథ్‌గా ఖ్యాతికెక్కుతోంది ఈ క్షేత్రం. హిమాలయాల్లో కొలువైన బద్రినాథ్‌కు వెళ్ళలేని వారికి ఇది చాలా సువర్ణ అవకాశమంటున్నారు భక్తులు. ఈ క్షేత్రాన్ని దర్శించడం ఎంతో అదృష్టమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. బండ్లమైలారం బద్రీనాథ్‌ దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

తెలంగాణలో బద్రీనాథ్‌.. భక్తులు విశేషంగా ఆకట్టుకుంటోంది.. ప్రతిరోజూ రద్దీనే..
Badrinath Temple
Follow us on

ఉత్తరాఖండ్‌లోని బద్రినాథ్‌కు అచ్చుగుద్దినట్టుగా నిర్మించారు ఈ ఆలయాన్ని . సిద్దిపేట జిల్లా బండ్లమైలారంలో ని ఈ క్షేత్రం ఇప్పుడు ఆధ్మాత్మిక,పర్యాటక కేంద్రంగా మారింది. హిమగిరుల్లో కొలువైన బద్రినారాయణుడిని ఒక్కసారైనా దర్శించుకోవాలని భావిస్తారెందరో.కానీ వాతవారణ ప్రతికూలతల వల్ల అందరికీ అది సాధ్యం కాదు. అందుకే బండ్లమైలారంకు చెందిన భక్తులు..బద్రినాథ్‌ ట్రస్ట్‌ వారితో సంప్రదించి తెలంగాణలో ఈ క్షేత్రాన్ని నిర్మించారు.

బద్రినాథ్‌కు చెందిన 11 మంది ప్రధాన పూజారులు హోమాలు, గాయత్రీ యజ్ఞం చేసి ఈ ఆలయాన్ని ప్రారంభించారు. బద్రినాథ్‌నుంచి అఖండ జ్యోతిని తీసుకుని వచ్చారు. పూజాది కార్యక్రమాలు అక్కడ ఎలా జరుగుతాయో ఈ క్షేత్రంలోనే అదే రీతిన కొనసాగిస్తున్నారు. ఉత్తరాఖండ్‌ బద్రీనాథ్ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యఫలం ఉంటుందో ..ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కూడా అంతటి పుణ్యఫలం ఉంటుందన్నారు పండితులు. హైదరాబాద్‌ దగ్గరలో అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్మించిన ఈ క్షేత్రం.. బండ్లమైలారంలోని బద్రీనాథ్‌ క్షేత్రం అందర్నీ విశేషంగా ఆకర్షిస్తోంది.

రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ప్రశాంత వాతావరణం..ఎటు చూడూ ఆధ్మాత్మిక శోభతో తెలంగాణ బద్రీనాథ్‌గా ఖ్యాతికెక్కుతోంది ఈ క్షేత్రం. హిమాలయాల్లో కొలువైన బద్రినాథ్‌కు వెళ్ళలేని వారికి ఇది చాలా సువర్ణ అవకాశమంటున్నారు భక్తులు. ఈ క్షేత్రాన్ని దర్శించడం ఎంతో అదృష్టమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. బండ్లమైలారం బద్రీనాథ్‌ దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..