Ayodhya Temple: రామ మందిర ప్రతిష్టకు 1992లో మరణించిన కరసేవకుల కుటుంబాల సహా 7000 మంది వీవీఐపీలకు ఆహ్వానం

|

Dec 07, 2023 | 8:45 AM

రామాలయంలో రామ్ లాలా ప్రతిష్ఠాపన 22 జనవరి 2024న జరగనుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం అందింది. అంతేకాదు ట్రస్ట్ 3000 VVIP లతో సహా 7 వేల మందికి ఆహ్వానాలు పంపింది. వీరిలో 1992లో మరణించిన కరసేవకుల కుటుంబాలు, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యోగా గురు రామ్‌దేవ్, పారిశ్రామికవేత్త రతన్ టాటా, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఉన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 4 వేల మంది సాధువులను కూడా ఆహ్వానించారు.

Ayodhya Temple: రామ మందిర ప్రతిష్టకు 1992లో మరణించిన కరసేవకుల కుటుంబాల సహా 7000 మంది వీవీఐపీలకు ఆహ్వానం
2020 లో రామ మందిర శంకుస్థాపన మొదలు.. 2023 మార్చి 31 వరకూ రామాలయ నిర్మాణ సంబంధిత పనులతో పాటు, భక్తులకు సౌకర్యాల కల్పన నిమిత్తం మొత్తం రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేశామని అయోధ్య ట్రస్ట్‌ కోశాధికారి గోవింద్‌ దేవగిరి వెల్లడించారు. 
Follow us on

కోట్లాది హిందువుల కల తీరే సమయం ఆసన్నమవుతుంది. అయోధ్యలోని రామాలయంలో జరిగే రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఏడు వేల మందికి ఆహ్వానం పంపించినట్లు రామమందిరం ట్రస్ట్  వర్గాలు తెలిపాయి. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సినీ నటుడు అమితాబ్ బచ్చన్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, యోగా గురువు రామ్‌దేవ్‌, పారిశ్రామికవేత్తలు ముఖేష్‌ అంబాయ్‌, రతన్‌ టాటా, గౌతమ్‌ అదానీ సహా పలువురు వీవీఐపీలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించినట్లు సమాచారం. విశేషమేమిటంటే 1992లో మరణించిన కరసేవకుల కుటుంబాలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. రామాయణంలో రాముడి పాత్రను పోషించిన అరుణ్ గోవిల్ (రాముడు), సీతాదేవిగా నటించిన దీపికా చిఖాలియాకు కూడా ఆహ్వానాలను పంపించారు.

రామాలయంలో రామ్ లాలా ప్రతిష్ఠాపన 22 జనవరి 2024న జరగనుంది. ఈ మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోరుతూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం అందింది. అంతేకాదు ట్రస్ట్ 3000 VVIP లతో సహా 7 వేల మందికి ఆహ్వానాలు పంపింది.

50 దేశాల నుంచి ఒక్కో ప్రతినిధికి ఆహ్వానం..

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి 50 దేశాల నుండి ఒక ప్రతినిధిని ఆహ్వానించడానికి ప్రయత్నం జరుగుతోంది. రామ మందిరం ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 50 మంది కరసేవకుల కుటుంబ సభ్యులను, న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, రచయితలు, కవులకు ఆహ్వానాలు పంపాం’’ అని తెలిపారు. వీరితో పాటు సాధువులు, పూజారులు, శంకరాచార్యులు, మత పెద్దలు, మాజీ సివిల్ సర్వెంట్లు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, న్యాయవాదులు, సంగీత విద్వాంసులు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీతలను ఆహ్వానించినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

బార్ కోడ్ పాస్ ద్వారా ప్రవేశం

విశ్వహిందూ పరిషత్ (VHP) ప్రతినిధి శరద్ శర్మ మాట్లాడుతూ ‘రామ మందిర ఉద్యమానికి మద్దతు ఇచ్చిన జర్నలిస్టులను కూడా ఆహ్వానించామని చెప్పారు. బార్‌కోడ్‌ పాస్‌ ద్వారా వీవీఐపీలకు ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. ఆహ్వానించబడిన 7,000 మందిలో దాదాపు 4,000 మంది దేశవ్యాప్తంగా ఉన్న మత పెద్దలు. వేడుకకు ముందు ఆహ్వానితులతో లింక్ షేర్ చేయబడుతుంది. వారు లింక్‌తో నమోదు చేసుకున్న తర్వాత, ఎంట్రీ పాస్‌గా పనిచేసే కోడ్ రూపొందించబడుతుందని వెల్లడించారు.

ఆహ్వాన పత్రం ఇలా ఉంది..

శ్రీరామ జన్మభూమిలో ఆలయ నిర్మాణం కోసం సుదీర్ఘ  పోరాటం తర్వాత మొదలైంది.  పుష్య మాసం శుక్ల పక్షం ద్వాదశి తిధి విక్రమ సంవత్సరం 2080, సోమవారం (22 జనవరి 2024) గర్భగుడిలో రామ్ లల్లా  విగ్రహం ప్రతిష్ఠించనున్నారు. ఈ మహత్తరమైన చారిత్రాత్మక రోజు గౌరవాన్ని పెంపొందించడానికి , జీవిత పవిత్రతకు సాక్ష్యమివ్వడానికి ఈ శుభ సందర్భంలో అయోధ్యలో ఉండాలని తమ కోరిక అంటూ ఆహ్వానం లో ఉంది. ఆహ్వానిస్తూ క్రింద రామమందిర్ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ సంతకం ఉంది.

15లోగా విగ్రహ తయారీ పనులు పూర్తి

అయోధ్యలోని రామజన్మభూమిలో నిర్మిస్తున్న ఆలయ గర్భగుడిలో రాంలాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు డిసెంబర్ 15 నాటికి సిద్ధమవుతుంది. ఆలయ ట్రస్టు అధికారులు ఇప్పటికే ఈ మేరకు సమాచారం అందించారు. రామ్ లల్లా (బాల రాముడి రూపం) మూడు విగ్రహాలను తయారు చేస్తున్నామని చెప్పారు. మూడు రామ్ లల్లా విగ్రహాల తయారీ పనులు తుదిదశకు చేరుకున్నాయని. ఈ విగ్రహాల్లో ఒకటి రామాలయంలోని గర్భగుడిలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మూడు విగ్రహాలలో రెండు కర్ణాటకకు చెందిన రాతితో, ఒకటి రాజస్థాన్‌కు చెందినవి అని ఆయన చెప్పారు. డిసెంబర్ 15న గర్భగుడిలో నిర్వహించే ప్రతిష్ఠాపనకు ఉత్తమ విగ్రహాన్ని ఆలయ ట్రస్టు ధార్మిక కమిటీ ఎంపిక చేస్తుందని అధికారులు తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..