Ayodhya: బాల రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు.. భారీగా హుండీ ఆదాయం.. విరాళం ఇచ్చే వారికి పన్ను మినహాయింపు

|

Feb 03, 2024 | 7:25 AM

ఆలయ గర్భగుడిలో, ప్రాణ ప్రతిష్ట జరిగిన చోట, గర్భగుడి ముందు ఉన్న 'దర్శన మార్గం' దగ్గర నాలుగు పెద్ద సైజు హుండీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ హుండీల్లో భక్తులు తమ కానుకలను అందించవచ్చు అని  ఆయన తెలిపారు. 11 మంది బ్యాంకు ఉద్యోగులు, ఆలయ ట్రస్ట్‌కు చెందిన ముగ్గురుతో కూడిన 14 మంది బృందం ఈ నాలుగు హుండీల్లోని కానుకలను లెక్కిస్తారని వెల్లడించారు. ఈ విరాళాల మొత్తాన్ని జమ చేయడం నుంచి లెక్కింపు వరకు అంతా సీసీ కెమెరాల నిఘాలో జరుగుతుందని గుప్తా తెలిపారు.

Ayodhya: బాల రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు.. భారీగా హుండీ ఆదాయం.. విరాళం ఇచ్చే వారికి పన్ను మినహాయింపు
Ayodhya Ram Mandir
Follow us on

కొన్ని వందల ఏళ్ల కల తీరిన వేళ అయోధ్య బాల రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ప్రాణ ప్రతిష్ట మర్నాడు అంటే జనవరి 23వ తేదీ నుంచి సామాన్యులకు బాల రామయ్య దర్శనం ఇస్తున్న వేళ భక్తుల ప్రవాహం కొనసాగుతుంది. రోజూ లక్ష మందికిపైగా భక్తులు రామయ్యను దర్శించుకుంటున్నారు. అదే స్థాయిలో రామయ్య హుండికి కూడా ఆదాయం సమకూరుతుంది. రామజన్మభూమి తీర్థ క్షేత్రం ప్రకారం  రామజన్మభూమిని గత 11 రోజుల్లో సుమారు 25 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. గడిచిన 11 రోజుల్లో 11 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లు అయోధ్య రామాలయం ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. ఇందులో హుండీ ఆదాయం రూ.8 కోట్లు ఉండగా, చెక్కులు, ఆన్‌లైన్‌ పేమెంట్‌ రూపంలో మరో రూ.3.5 కోట్లు వచ్చినట్లు ఆలయ ట్రస్టు అధికారి ప్రకాశ్‌ గుప్తా వెల్లడించారు. అయితే ఇప్పటివరకు 25 లక్షల మందికి పైగా భక్తులు రామయ్యను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.

అయోధ్య రామమందిర ట్రస్ట్‌కు సహకరించిన భక్తులు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80G కింద మినహాయింపును పొందవచ్చని ఆలయ ట్రస్ట్ కార్యాలయ ఇన్‌చార్జి ప్రకాష్ గుప్తా వెల్లడించారు. రామ్ లల్లా దర్శనం కోసం ప్రతిరోజూ 2 లక్షల మందికి పైగా భక్తులు రామాలయానికి చేరుకుంటున్నారు.

ఆలయ గర్భగుడిలో, ప్రాణ ప్రతిష్ట జరిగిన చోట, గర్భగుడి ముందు ఉన్న ‘దర్శన మార్గం’ దగ్గర నాలుగు పెద్ద సైజు హుండీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ హుండీల్లో భక్తులు తమ కానుకలను అందించవచ్చు అని  ఆయన తెలిపారు. 11 మంది బ్యాంకు ఉద్యోగులు, ఆలయ ట్రస్ట్‌కు చెందిన ముగ్గురుతో కూడిన 14 మంది బృందం ఈ నాలుగు హుండీల్లోని కానుకలను లెక్కిస్తారని వెల్లడించారు. ఈ విరాళాల మొత్తాన్ని జమ చేయడం నుంచి లెక్కింపు వరకు అంతా సీసీ కెమెరాల నిఘాలో జరుగుతుందని గుప్తా తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆలయ విరాళాలపై ఆదాయపు పన్ను మినహాయింపు

అధికారికంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌గా పిలవబడే అయోధ్య రామమందిర ట్రస్ట్‌కు విరాళాలు అందించిన వ్యక్తులు లేదా సమీప భవిష్యత్తులో విరాళాలు ఇవ్వాలనుకునే వారు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80G కింద మినహాయింపును పొందేందుకు అర్హులని చెప్పారు.

భారతదేశంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80G అనేది వ్యక్తులు లేదా సంస్థలు అర్హులైన స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపు ఉంది. ఈ సెక్షన్ ప్రకారం విరాళం అందించే వారు పన్ను మినహాయింపుని క్లెయిమ్ చేసుకోవచ్చు అనే నిబంధన ఉంది.

వ్యక్తులు చెక్కులు, UPI , ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వివిధ మార్గాల ద్వారా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సహకరించవచ్చు.

విరాళం ఆన్‌లైన్‌లో https://srjbtkshetra.org/ వద్ద అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి, ‘విరాళం’ ట్యాబ్‌లోని ‘విరాళం’పై క్లిక్ చేసి, మొబైల్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ అవ్వడం ద్వారా అందించవచ్చు. ఆ తర్వాత, వ్యక్తులు అందుకున్న OTPని ఉపయోగించి ప్రమాణీకరించవచ్చు మరియు విరాళం కోసం బ్యాంక్ ఖాతాను (SBI, PNB, లేదా BoB) ఎంచుకోవచ్చు.

సెక్షన్ 80G కింద మినహాయింపును క్లెయిమ్ చేయడానికి వ్యక్తులు తప్పనిసరిగా విరాళం రసీదుని కలిగి ఉండాలి. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ను సమర్పించేటప్పుడు, వ్యక్తులు విరాళం మొత్తాన్ని, అవసరమైన సమాచారాన్ని ఫారమ్‌లోని నిర్దేశిత ప్రాంతంలో ఇన్‌పుట్ చేయడం ద్వారా వర్తించే విభాగం కింద మినహాయింపులను ప్రకటించే అవకాశం ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..