Astro Remedies: మీ దంతాలు ఈ ఆకారంలో ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది, అదృష్టం ఎల్లప్పుడూ మీతో ఉంటుందట

|

Nov 12, 2022 | 3:40 PM

కొంతమంది పంటి పంటి మధ్య గ్యాప్ ఉంటుంది. మరొకొందరి పళ్లు ఒకటిదానిపై ఒకటి అతుక్కుని ఉంటాయి. అయితే దంతాల ఆకృతి కూడా ఆ వ్యక్తి అదృష్టానికి సంబంధించినదని కొందరు నమ్ముతారు. ఈ నేపథ్యంలో దంతాల అమరికతో వ్యక్తి నేచర్ ఏమిటో తెలుసుకుందాం.

Astro Remedies: మీ దంతాలు ఈ ఆకారంలో ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది, అదృష్టం ఎల్లప్పుడూ మీతో ఉంటుందట
Gap Between Teeth
Follow us on

మనిషి అందం చిరునవ్వుతో మరింత పెరుగుతుందని అంటారు. అయితే దంతాల ఆకృతి సరైన రీతిలో లేకుంటే.. పది మందిలో నవ్వడానికి చాలామంది  ఇబ్బంది పడుతుంటారు. ఇతరులతో పోలిస్తే అటువంటివారిలో విశ్వాసం తగ్గుతుంది. అయితే దంతాల గురించి మాట్లాడినట్లయితే కొంతమంది పంటి పంటి మధ్య గ్యాప్ ఉంటుంది. మరొకొందరి పళ్లు ఒకటిదానిపై ఒకటి అతుక్కుని ఉంటాయి. అయితే దంతాల ఆకృతి కూడా ఆ వ్యక్తి అదృష్టానికి సంబంధించినదని కొందరు నమ్ముతారు. ఈ నేపథ్యంలో దంతాల అమరికతో వ్యక్తి నేచర్ ఏమిటో తెలుసుకుందాం.

ఇటువంటి వ్యక్తులు అదృష్టవంతులు
దంతాల మధ్య ఖాళీ ఎక్కువగా ఉన్నవారు అదృష్టవంతులని నమ్ముతారు. ఇటువంటి వారి జీవితంలో ఎప్పుడూ డబ్బుకు, తిండికి లోటు ఉండదు. అయితే అందాన్ని పెంచుకోవడానికి పళ్ల మధ్య ఖాళీలను పూడ్చుకునే వారు చాలా మంది ఉన్నారు.

చురుకైన వ్యక్తులు
దంతాల మధ్య గ్యాప్ ఉన్న వ్యక్తులు.. ఆలోచనలో కూడా చాలా చురుకుగా ఉంటారని నమ్మకం. మెదడుతో చాలా చురుకుగా పనిచేస్తుందని.. ఇంతటి  కష్టమైన విషయాలను సులభంగా అర్థం చేసుకుంటారు. ఈ వ్యక్తులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచిస్తారు. అందుకనే తప్పులు చేసేయడం అతి తక్కువ. ఇలాంటి వారిని దౌత్యపరంగా కూడా చాలా మేధావులుగా పరిగణిస్తారు.

ఇవి కూడా చదవండి

విజయం సులభంగా వస్తుంది
దంతాలు సరళ రేఖలో  కాకుండా దంతాలు వంకరగా ఉన్నవారు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. అలాంటి వ్యక్తులు ఎలాంటి పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొంటారు. పరిస్థితులకు భయపడరు.

భాగస్వామి అదృష్టం:
పళ్లలో గ్యాప్ ఉన్న వ్యక్తులను పెళ్లి చేసుకున్నా వారి దురదృష్టం కూడా మారుతుందని నమ్మకం. భార్యాభర్తల జీవితంలో వచ్చే సమస్యలు కూడా దూరమవుతాయి. ఇలాంటి వ్యక్తులు తమ భాగస్వామిని చాలా ప్రేమిస్తారు.

ప్రతికూల పరిస్థితుల్లోకూడా దైర్యంగా
కొందరి దంతాలు ఒకదానిపై మరొకటి ఉంటాయి. అలాంటి వ్యక్తులు తమ శత్రువులను సులభంగా జయిస్తారు. అంతేకాదు వీరు సుఖ, దుఃఖం రెండింటిలోనూ సమానమైన ఆలోచనలను కలిగి ఉంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)